Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ - ఈ అంశాలపైనే చర్చ
Telangana News: ఈసీ అనుమతి తర్వాత తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సోమవారం సమావేశమైంది. సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతు విధించింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపైనే ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, శనివారమే కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉండగా.. ఆ రోజు రాత్రి వరకూ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. దీంతో భేటీ వాయిదా పడింది. ఆదివారం భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ కొన్ని షరతులు విధించింది. అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. అలాగే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులెవరూ ఈ భేటీలో పాల్గొనకూడదని ఆదేశించింది. తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే మంత్రి వర్గంలో చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది.