News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dalitha Bandhu Telangana: దళితబంధు అమలు తేదీ ఖరారు, ఆ రోజు నుంచే హుజూరాబాద్‌లో.. కేబినెట్ నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం (ఆగస్టు 1) సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి హుజూరాబాద్‌‌లో దళిత బంధు ప్రారంభించాలని నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన కొత్త పథకం దళిత బంధును ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం (ఆగస్టు 1) సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇంకా 15 రోజులే సమయం ఉన్నందున పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్ వివరించారు.

దళిత బంధుకు చట్టబద్ధత
దళితుల కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం అమలుకు సంబంధించి మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళితబంధు పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్పీ ప్రగతినిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్‌కు బదలాయించే విధానం తీసుకొచ్చామని గుర్తు చేసుకున్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ క్యాబినెట్ అభిప్రాయపడింది.

దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్ద మొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదనీ ముఖ్యమంత్రి తెలియజేశారు. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్ఛంద కార్యకర్తలు వారికి మార్గదర్శనం చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

లబ్ధి దారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వశాఖ శిక్షణ అవగాహన కల్పించాలని కేబినెట్ అభిప్రాయపడింది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

కచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ
యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్ తీర్మానించింది. దళిత బంధు పథకం అమలుకు పటిష్ఠమైన యంత్రాంగం అవసరమనీ వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్‌లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుడి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని వివరించింది. 

దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళితవాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఉద్యోగాల భర్తీపై జరగని చర్చ
రాష్ట్రంలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలున్నాయని ప్రభుత్వం మంత్రిమండలికి నివేదించింది. ఈ జాబితాను అధ్యయనం చేస్తామని, వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా తెలుస్తోంది.

Published at : 02 Aug 2021 07:24 AM (IST) Tags: huzurabad bypoll cm kcr Dalitha bandhu in telangana Dalitha bandhu news telangana cabinet decisions

ఇవి కూడా చూడండి

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!

Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!