Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Jayalalitha మరణం తర్వాత అన్నాడీఎంకేను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి.
Vijayashanthi Meets VK Shashikala In Chennai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళను (VK Shashikala) తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) కలిశారు. వీరి భేటీ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. శశికళ (VK Shashikala) జైలు నుంచి విడుదలైన సమయంలో చెన్నైలోని ఆమె నివాసంలో విజయశాంతి (Vijayashanthi) బహిరంగంగానే సమావేశం అయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి రహస్యంగా కలిశారు. ఈ భేటీలో వీరు ఇద్దరూ శశికళ (VK Shashikala News) భవిష్యత్ రాజకీయ ప్రయాణం గురించి కూలంకషంగా చర్చించినట్లు సమాచారం.
జయలలిత (Jaya Lalitha) మరణం తర్వాత అన్నాడీఎంకే కార్యకలాపాలను బీజేపీ నియంత్రిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే నుంచి విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ చీఫ్ గా ఉన్న ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అప్పుడు సఫలం కాలేదు.
ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన వారిని మళ్లీ కలపాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయశాంతి (Vijayashanthi) శశికళతో భేటీ అయినట్లుగా సమాచారం.
శశికళ ప్రస్తుతం తమిళనాడు అంతటా ఆధ్యాత్మిక యాత్ర (VK Shashikala Tour) చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆమె తన మద్దతుదారుల కోసం బహిరంగ సభలకు కూడా హాజరవుతున్నారు. ఇంకా త్వరలో తన రాజకీయ యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు శశికళ గతంలోనే చెప్పారు. రెండు రోజుల క్రితం కూడా, అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని వాలంటీర్లు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నేతలు తనతో టచ్‌లో ఉన్నారని కూడా చెప్పారు. అన్నాడీఎంకేలోని కొందరు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని శశికళ ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకేకు తాను కచ్చితంగా నాయకత్వం వహిస్తానని, దానిపై తనకు 100 శాతం విశ్వాసం ఉందని శశికళ (VK Shashikala) గత వారం చెప్పారు. అధిష్టానాన్ని మళ్లీ పటిష్ఠం చేసేందుకు శశికళ సీక్రెట్ ప్లాన్ తో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) తాజాగా శశికళను (VK Shashikala) రహస్యంగా కలిశారు.
Also Read: TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్