Bandi Sanjay Slams KCR: అత్యాచారం జరగని రోజు లేదు, TRS, MIM నేతల వీపులు వాయగొట్టే రోజులు దగ్గర పడ్డాయి: బండి సంజయ్
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ నగర్‌లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకుల వీపులు వాయగొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు
Bandi Sanjay Kumar Fire On CM KCR: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరగడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే నిందితులు మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ నగర్‌లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఈ ఘటనలో నిందితులకు చట్టపరంగా శిక్ష పడేవరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో బాలికలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం (MIM), టీఆర్ఎస్ (TRS) నాయకుల వీపులు వాయగొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ స్పందించకపోవడం వల్లే దారుణాలు..
తెలంగాణలో ఎన్నో చోట్ల నిత్యం మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు జరగుతున్నాయి. కానీ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) వాటిపై వెంటనే స్పందించకపోవడం, నేరాల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అత్యాచారాల నియంత్రణపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అత్యాచార ఘటనలు జరిగిన వెంటనే సీఎం స్పందించకపోవడం, నేరాల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యాచారాల నియంత్రణపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారిన @myogiadityanath గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2022
అత్యాచారం జరగని రోజు లేదు
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మహిళలు, బాలికలపై అత్యాచారం జరగని రోజు లేదని, ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని బండి సంజయ్ మండిపడ్డారు. అత్యాచార ఘటనల్లో ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీ నాయకుల సంబంధికులే ఉన్నారు. ప్రభుత్వం దుండగుల పట్ల కఠినంగా వ్యవహరించకపోగా వారికి రక్షణ కల్పిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ కేసు: వారం క్రితమే ప్లాన్, నొప్పి లేకుండా ఎలా అని శోధన - విచారణలో కీలక విషయాలు