Telangana Assembly : ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ నెంబర్ వన్ - కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమయిందన్న కేటీఆర్ !
తెలంగాణ అసెంబ్లీ సమవేశాల్లో ఐటీ రంగంపై కేటీార్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమయిందని కేటీఆర్ అన్నారు.
Telangana Assembly : కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఐటీ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని కేటీఆర్ ప్రకటించారు. దేశంలో ఉన్న ఐటీ పురోగతితో పోలిస్తే మన ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు… శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్‌లోని బేగంపేటలో 1987లో మొట్టమొదట ఐటీ టవర్ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు.. 27 సంవత్సరాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమతులు మాత్రమే నని, కానీ గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమతులు సాధించిందని పేర్కొన్నారు. ఇది సమర్థత గల ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని, . ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, . ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
తెలంగాణలో మతాల పంచాయతీ లేదు, కులాల మధ్య కొట్లాట లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్‌షిప్ వల్లే ఇదంతా సాధ్యం అయిందని విజ్ఞప్తి చేస్తున్నాను. గురుగ్రామ్‌లో ఐటీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు. మణిపూర్‌లో తెగల మధ్య కొట్లాట పెట్టారని విమర్శించారు. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవే అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇవాళ ఎకరం ధర రూ. 100 కోట్లు పలుకుతోంది అని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు లేకపోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు 30 రోజులు జరపాలని బీజేపీ నాయకుడు ఉత్తరం రాశారని ... కాంగ్రెసోళ్లేమో 20 రోజులు జరపాల్నారు. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో మేమందరం ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒకరి చొప్పున మాత్రమే సభలో ఉన్నారని విమర్శించారు. దీన్ని బట్టి వీరికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ప్రజల పట్ల వీరికున్న ప్రేమ, అభిమానం తెలుస్తుంది. బయటనేమో డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి అని. కానీ 30 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు వీళ్లకు. వీళ్లను ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ల సంగతేందో ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.