Breaking News Live Updates: మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్ట్... బెయిల్ పై విడుదల..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మీ. రేణిగుంట విమానాశ్రయం వద్ద వీరికి అభిమానులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం వీ.ఐ.పీ విరామ సమయంలో మా ఫ్యానల్ సభ్యులతో కలిసి మా అధ్యక్షుడు మంచు విష్ణు స్వామి వారిని దర్శించుకోనున్నారు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో ఒకరు చనిపోయగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,938కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 3,924 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 176 మంది కరోనాను జయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నిద్రపోతున్న బాలుడిని కాటేసిన పాము
తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో పాముకాటుతో సమీర్ అనే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిని ఆదివారం తెల్లవారుజామున పాముకాటు వేసింది. బాలుడు ఏడువడంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముందస్తు ఎన్నికల అంశంపై నేతలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సమావేశంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడి పనిచేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ.. కాగా హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ ఏజెన్సీలో పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి
విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా పోలీసులపై దాడికి దిగింది. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు 10 రౌండ్ల కాల్పులు చేసినట్లు తెలుస్తోంది.