అన్వేషించండి

Telangana News: తెలంగాణ రోజుకు వంద ఫోన్లు మాయం- రికవరీ అయ్యేవి నలభయ్యే!

Telangana News: వంద రోజుల్లోనే 9,720 ఫోన్లు పోగొట్టుకోగా పోలీసులు వీటిని గుర్తించారు. సీఈఐఆర్ సాయంతో మొత్తం 4 వేల 83 ఫోన్లను రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించారు.   

Telangana News: వంద రోజుల్లోనే 9 వేల 720 మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. చోరీకి గురైన, తామే మరిచిపోయి వీటిని పోగట్టుకోగా... పోలీసులు వీటిని గుర్తించారు. సీఈఐఆర్ సాయంతో మొత్తం 4 వేల 83 ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు అప్పగించారు. దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను గుర్తించడానికి తెలంగాణ పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) సైట్‌ను ఉపయోగిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సీఈఐఆర్ వినియోగంలో పోలీసులు తమ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లకు లాగిన్ ఐడీలను సరఫరా చేశారు. తెలంగాణలో అత్యధికంగా సైబరాబాద్‌ 554, రాచకొండ 321, వరంగల్‌ 300, హైదరాబాద్‌ 265 మొబైల్ ఫోన్లను అందించాయి. 

ఫోన్ పోగొట్టుకోగానే, చేయాల్సిన పని ఇదే

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన మొబైల్లోని నంబర్లు, IMEI నంబరు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. ఆ ఐడి మిస్సయిన ఫోన్ స్టేటస్ తెలుపుతుంది. అది ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది అనే వివరాలను ఐడెంటిఫై చేస్తుంది. మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఈ సాంకేతికను ఉపయోగించే పోలీసులు మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకున్నారు.

ఫోన్ దొరకగానే టాస్క్ అక్కడితో ఆగిపోదు

ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని- అన్ బ్లాక్! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ దొరికిన అదే వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. అడిగిన ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

వెబ్ సైట్ గురించి అందరికీ తెలియాలి..!

CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ పోయినా, చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్లో పిర్యాదు చేసుకోవాలని వివరిస్తున్నారు. ఆ సైట్‌పై ప్రత్యేక అవగాహన కలిగిఉండాలని పేర్కొంటున్నారు. దీని ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు. ఈ సైట్ ఆపరేషనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులకు  శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget