Malkajgiri News: దీపావళి వేడుకల్లో అపశ్రుతి - చీరకు నిప్పంటుకోగా భార్యను రక్షించబోయి భర్త మృతి
Telangana News: దీపావళి వేడుకల్లో మల్కాజ్ గిరిలో అపశ్రుతి చోటు చేసుకుంది. దీపాలు వెలిగిస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైన తన భార్యను రక్షించబోయి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
Malkajgiri Man Died Tried to Save his Wife: దీపావళి వేడుకలు ఓ ఇంట తీవ్ర విషాదాన్ని నింపాయి. హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో తన భార్య చీరకు నిప్పంటుకోగా ఆమెను రక్షించబోయి భర్త మృతి చెందాడు. వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న రాఘవరావు (82), అతని సతీమణి రాఘవమ్మ (79) దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. దీన్ని గమనించిన రాఘవరావు ఆమెను రక్షించేందుకు యత్నించగా, మంటలు అంటుకుని మృతి చెందాడు. రాఘవమ్మకు 80 శాతం గాయాలు కాగా, స్థానికులు గుర్తించి ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాఘవరావు మృతితో కాలనీలో తీవ్ర విషాదం అలుముకుంది. పండుగ పూట ఇలాంటి ఘోరం జరిగిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Medak Accident News: పండుగ పూట తీవ్ర విషాదం - ప్రమాదంలో కవలలు, ఆత్మహత్య చేసుకుని తల్లీకూతుళ్లు మృతి