TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు!
TRS MLAs Poaching Case: మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీం కోర్తు ఎత్తివేసింది. సిట్ విచారణను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.
![TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు! Supreme Court Orders on TRS MLA's Poaching Case TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/6422c1bf1e74c7e594e362809d5945d41669022560450519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీం కోర్టు ఎత్తి వేసింది. సింగిల్ జడ్ది పర్యవేక్షణ, సిట్ విచారణ నిలిపి వేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్ పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి వేసింది సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్నాసనం ఆదేశించింది.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌ను మిగతా ముగ్గురు విచారణకు రాలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుడు జగ్గుస్వామి, కేరళలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ విచారణకు పిలిచింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందజేసింది. ఈ రూల్స్ ప్రకారం నోటీసులు అందుకుంటే కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.
అరెస్టులు వద్దని చెప్పిన హైకోర్టు..
సిట్ విచారణపై హైకోర్టుకు వెెళ్లిన బీజేపీకి నిరాశే ఎదురైంది. జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను సైతం హైకోర్టు విచారించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)