అన్వేషించండి

Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?

నవంబర్ 20వ తేదీ వరకూ కవితకు సమన్లు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది.

 

Kavitha Case :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న  పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ ఈడీ సమన్లు కూడా జారీ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈడీ విచారణ ఎదుర్కొనే అంశంలో కవితకు ఊరట లభించినట్లయింది. గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది ఈడీ. ఇప్పుడు మరోసారి నవంబర్ ఇరవయ్యో తేదీ వరకూ వాయిదా వేయడానికి అంగీకరించింది.                   

గతంలో లిక్కర్‌ కేసులో   ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హారజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్‌ వేశారు.ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.                  

అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్‌ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారామె. అంతే కాదు తాను విచారణకు రాలేనని  ఈడీకి స్పష్టం చేశారు.  కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల సమయం పొడగిస్తామని గత విచారణలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో నేటితో పదిరోజుల గడువు ముగిసింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా.. కవిత పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణలోపు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని సుప్రీం కోర్టు, ఈడీకి స్పష్టం చేసింది.  

సిఆర్పిసి సెక్షన్ 160 ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉల్లంఘించిందని కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదించారు.  చట్ట ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటి దగ్గరే విచారణ జరపాలని, కానీ వ్యక్తిగతంగా హాజరుకావాలని తనకు సెక్షన్ 50 ప్రకారం నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కవిత తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే పీఎంఎల్ఏ కేసుల్లోకి సెక్షన్ 160 వర్తించదని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 50ని ధర్మాసనానికి వివరించారు. చట్ట ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే అధికారాలు ఈడికి ఉన్నాయని ఈడి తరపు న్యాయవాది ఎస్వీ రాజు తమ వాదన వినిపించారు. నవంబర్ 20వ తేదీ వరకూ కవితను విచారణ చేయడం లేదా అరెస్టు చేయడం వంటి పరిణామాలు ఉండే అవకాశం లేదు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget