Telangana సీఈవో వికాస్ రాజ్ బదిలీ, నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

Sudarshan Reddy Telangana Chief Election officer | తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. తెలంగాణ నూతన ఎన్నికల ప్రధానాధికారికిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ వ్యవహరిస్తున్నారని తెలిసిందే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సీఈవో వికాస్ రాజ్ నిర్వహించారు.
తాజాగా తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో వికాస్ రాజ్ ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు























