అన్వేషించండి

SCR: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి!

Telangana News: వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు.

Summer Special Trains From Secunderabad: ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలిమార్, సాంత్రగాచిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రయాణీకులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించారు.

ప్రత్యేక రైళ్లు ఇవే..

☞ సికింద్రాబాద్ - సాంత్రాగాఛి (07223) ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకూ ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అలాగే, సాంత్రాగాఛి - సికింద్రాబాద్ (07224) ప్రత్యేక రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఏపీలో గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్ పూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

☞ సికింద్రాబాద్ - షాలిమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకూ ప్రతి సోమవారం.. అలాగే షాలిమార్ - సికింద్రాబాద్ (07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ సర్వీసులు 11 ట్రిప్పులు తిరుగుతాయి. తెలంగాణలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. అటు, ఏపీలో రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్ పూర్, సాంత్రాగాచి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

☞ సికింద్రాబాద్ - కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - కొల్లం (07193) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29.. జూన్ 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. కొల్లం - సికింద్రాబాద్ (07194) రైలు ఏప్రిల్ 19, 26.. మే 3, 10, 17, 24, 31.. జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలో గుంటూరు, ఒంగోలు, రేణిగుంటలో ఆగుతుంది. అలాగే, కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఇంకా ప్రత్యేక సర్వీసులు

ఈ నెల 11న హుబ్బళ్లి - విజయవాడ (07002) మధ్య కూడా ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇరుమార్గాల్లో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, బళ్లారి, తోరనగల్లు, హోసేపేట జంక్షన్, మునిరాబాద్, కొప్పాల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. అలాగే, తిరుపతి, మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు (07517) బయలుదేరుతాయి. మరుసటి ఉదయం 8 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటాయి. నాగర్ సోల్ నుంచి ఏప్రిల్ 18. 25.. మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 10:50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అటు, తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 

Also Read: Hyderabad Traffic: రంజాన్ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్లే వారికి అలర్ట్

టాప్ హెడ్ లైన్స్

RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Telangana BJP MLC Elections: ఎమ్మెల్సీ పోరులో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బిగ్ రిస్క్ - గెలిస్తే ఓకే.. తేడా వస్తే బండి సంజయ్‌కి మళ్లీ పగ్గాలు?
ఎమ్మెల్సీ పోరులో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బిగ్ రిస్క్ - గెలిస్తే ఓకే.. తేడా వస్తే బండి సంజయ్‌కి మళ్లీ పగ్గాలు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget