News
News
X

Sharmila 3000 KM : షర్మిల పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి - రాజకీయంగా వైఎస్ఆర్‌టీపీ బలం పుంజుకుందా?

షర్మిల పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లకు చేరింది. పాదయాత్ర వల్ల వైఎస్ఆర్‌టీపీకి వచ్చిన మైలేజ్ ఎంత?

FOLLOW US: 

Sharmila 3000 KM :  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  జూలై 8న షర్మిల ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)’ పేరుతో  రాజకీయ పార్టీ స్థాపించారు. అనంతరం  ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.  గత సంవత్సరం అక్టోబర్ 20న  రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు.  గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు.  అందుకే సెంటిమెంట్‌గా భావించి తన తండ్రిలాగే చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలుపెట్టారు.  
 
తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని  ఉమ్మడి జిల్లా  మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో  అధికార టీఆర్ఎస్‌ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టించాయి. దీంతో ఆయా మంత్రులు, ఇతర నేతలు కూడా షర్మిలపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పలు విమర్శలు ఎదురవుతున్నా వెనుకడుగు వేయకుండా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
 
రాజకీయంగా పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ జనరల్ స్థానం. అలాగే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో వైఎస్సార్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల ఆమె పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఆదరణ లభిస్తుందా లేదా అన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. షర్మిల రాజకీయంగా ప్రధాన స్రవంతిలోకి ఇంకా రాలేదని అంచనా వేస్తున్నారు. 

ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ ఆమె పోటీకి ఆసక్తి చూపలేదు . దీంతో అసలు వైఎస్ఆర్ టీపీ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. ఆమెకు ప్రధానంగా స్థానిక సమస్య ఎదురవుతోంది. తెలంగాణ రాజకీయ నేతగా ఎక్కువ మంది గుర్తించడానికి ఆసక్తి చూపించడం లేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. షర్మిల కోసం ఆమె తల్లి పని చేస్తున్నారు. కానీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది అంచనా వేయడం కష్టమే. 

అయితే షర్మిల మాత్రం పట్టిన పట్టు వీడకుండా.. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి  చేశారు. ముందు ముందు పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు. 
 
Published at : 04 Nov 2022 03:34 PM (IST) Tags: YS Vijayamma SHARMILA PADAYATRA YSRTP Sharmila

సంబంధిత కథనాలు

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

PVP ED Office : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

PVP ED Office  : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్‌కు రిలీఫ్ - నిందితులకు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్‌కు రిలీఫ్ - నిందితులకు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు !

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్