KTR Tweets Supports : రాజకీయాల్లో కుటుంబసభ్యులను లాగి కించపర్చడం కరెక్ట్ కాదు.. కేటీఆర్‌కు షర్మిల, ప్రవీణ్ కుమార్ సపోర్ట్ !
కేటీఆర్ కుమారుడు హిమాన్షును బాడీషేమింగ్ చేస్తూ తీన్మార్ మల్లన్న పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమయింది. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగడం సరి కాదని.. కేటీఆర్‌కు ఇతర నేతలు సంఘిభావం చెబుతున్నారు.
![KTR Tweets Supports : రాజకీయాల్లో కుటుంబసభ్యులను లాగి కించపర్చడం కరెక్ట్ కాదు.. కేటీఆర్‌కు షర్మిల, ప్రవీణ్ కుమార్ సపోర్ట్ ! Sharmila, RS Praveen Kumar solidarity with KTR - Leaders say it is not right to drag family members into politics KTR Tweets Supports : రాజకీయాల్లో కుటుంబసభ్యులను లాగి కించపర్చడం కరెక్ట్ కాదు.. కేటీఆర్‌కు షర్మిల, ప్రవీణ్ కుమార్ సపోర్ట్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/25/c163971b31c6464eefe211caaab63bd0_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షును బాడీ షేమింగ్ చేస్తూ బీజేపీ నేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పెట్టిన ఓ ఫేస్‌బుక్ పోల్ వివాదాస్పదం అయింది. ఈ అంశంపై కేటీఆర్ నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇదేనా బీజేపీ నేతలకు ఉన్న సంస్కారం అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ దుమారం రేపడంతో మల్లన్న ఆఫీసుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్నపైనా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం దుమారం రేపుతోంది.
Sri @JPNadda Ji,
— KTR (@KTRTRS) December 24, 2021
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v
రాజకీయాలు ఎలా ఉన్నా తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి బాడీ షేమింగ్ చేయడం ఏమిటన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ విషయంలో కేటీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా.. ఇలాంటి వ్యక్తిగత దాడుల విషయంలో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని షర్మిల పేర్కొన్నారు.
As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations @KTRTRS https://t.co/6L16jNYtcL
— YS Sharmila (@realyssharmila) December 25, 2021
Also Read: టికెట్ రేట్స్... కెసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి!
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కూడా కేటీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తీన్మార్ మల్లన్న పెట్టిన ఫేస్‌బుక్ ఫోల్ అత్యంత బాధ్యతారాహిత్యమైనదిగా అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలు.. తమ విధానాల వేదికగా పోరాడాలని .. కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తూ కాదని ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ కూడా ఇలాంటి పరిస్థితి రావడానికి ఓ కారణం అని ప్రవీణ్ కుమార్ తన సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేశారు.
This is highly irresponsible poll bereft of basic decency. I urge all parties to confront their opponents on policy issues, but not the appearance of opponents and their family members. TRS is also equally responsible for bringing such vulgarity into political domain in Telangana pic.twitter.com/6pdamc8mHy
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 24, 2021
Also Read: టాలీవుడ్‌పై తెలంగాణ సర్కార్ చల్లని చూపు... టిక్కెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు !
ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి కుటుంబసభ్యులను దారుణంగా కించ పరిచే రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఇతర పార్టీల కుటుంబసభ్యుల్ని ఇంత కంటే దారుణంగా కించ పరిచారని పోస్టులు పెడుతున్నారు. తరచి చూస్తే అన్ని పార్టీల్లోనూ ఇలాంటి ధోరణి ఉంది. నిందల్ని ఒకరిపై ఒకరు వేసుకోకుండా.. అందరూ రాజకీయ అంశాలపై పోరాడితేనే మార్పు వస్తుందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)