(Source: ECI/ABP News/ABP Majha)
Sharmila On KCR : కవిత అరెస్ట్ తప్పదనే కథలు చెబుతున్నారు - కేసీఆర్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు !
కవిత అరెస్ట్ తప్పదనే కేసీఆర్ కథలు చెబుతున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీలో చేరలేదనే కేసులు పెట్టారని చెప్పబోతున్నారని అంటున్నారు.
Sharmila On KCR : కేసీఆర్ మంగళవారం కంటే కూతుర్నే కనాలి అనే సినిమా రిలీజ్ చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మానకొండూరులో వ్యంగ్యంగా విమర్శించారు. పాదయాత్రలో భాగంగా మానకొండూర్ చేరుకున్న ఆమె.. కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. కేసీఅర్ మొన్న నలుగురు ఎమ్మెల్యేల తో నాలుగు స్థంబాల ఆట సినిమా రిలీజ్ చేస్తే.. నిన్న కంటే కూతురునే కనాలి అని కొత్త సినిమాకి ట్రైలర్ ఓపెన్ చేశారన్నారు. కూతురు కవిత ను కూడా బీజేపీ కొనాలని చూసింది..అయినా అమ్ముడు పోలేదు అని చెప్తున్నారని..
అమ్ముడు పోనందుకు తన కూతురు పై లిక్కర్ స్కాం కేసు పెట్టారు అని కథ అల్లుతున్నారని షర్మిల విమర్శఇంచారు. కవితను అరెస్ట్ చేస్తారని కేసీఆర్‌కు అర్థం అయిందని.. ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలు ఫలించక అరెస్ట్ లు..కేసులు తప్పవు అని అర్ధం అయిందన్నారు. అందుకే ఇప్పుడు ఈ కొత్త సినిమా అని షర్మిల విశ్లేషించారు.
నిజంగా 4 గురు ఎమ్మెల్యే ల కొనుగోలు విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని షర్మిల ప్రశ్నించారు. ఆ రోజు కవిత విషయం ఎందుకు బయట పెట్టలేదు ..ఇప్పుడు కవిత అమ్మకం అంటూ కొత్త నాటకం ఎందుకు తెరపై తెస్తున్నారని అన్నారు. కవిత ను కొనాలని అనేది నిజం కాదని.. కవిత కు ఏం తక్కువ అని బీజేపీ కి అమ్ముడు పోవాలి..అబద్ధం చెప్తే అతికి నట్లు ఉండాలని కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణ ప్రజలకు ఏం మాటలు చెప్పిన నమ్ముతారు అనుకుంటున్నారని.. కేసీఅర్ మాటలు చూస్తే ప్రజలు ఉమ్మెస్తారని మండిపడ్డారు. కేసీఅర్ అవినీతి పాలన ను బీజేపీ కానీ,కాంగ్రెస్ కానీ ప్రశ్నించడం లేదన్నారు.
బండి సంజయ్ కమిషన్లు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కి నిజాయితీ ఉంటే...మీరు కమీషన్ లు తీసుకుకొక పోతే మీ కాళేశ్వరం పై మీ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. సీబీఐ విచారణ ఎందుకు లేదు..?. ఈడి విచారణ ఎందుకు లేదు మీరు డబ్బు తీసుకోక పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ కోరండని YSRTP డిమాండ్ చేస్తుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ .. కేసీఆర్ స్టైల్లో వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని.. కానీ ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదన్నారు. కేసీఅర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఫామ్ హౌజ్ నీళ్ళు ఎత్తుకు పోతే ఈయన మిడ్ మానెర్ నీళ్ళు ఎత్తుకు పోతున్నాడని మండిపడ్డారు.
ఒకప్పుడు ఉద్యమ కారుడు గా మంచి పేరు ఉండే ..నమ్మి ఓటేస్తే రౌడీ అయ్యాడన్నారు. ఒకప్పుడు అకౌంట్ లో లక్ష రూపాయలు లేని రసమయి కి 100 ల కోట్లు ఎలా వచ్చాయని షర్మిల ప్రశ్నించారు. మాన కొండూరు నియోజక వర్గానికి YSR ఎంతో చేశారు మిడ్ మానెర్ కట్టారు వైఎస్సార్ హయాంలో నే 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిడ్ మానెర్ ద్వారా లక్షల ఎకరాలకు నీరు పారుతుంది.. ఇప్పుడు కేసీఅర్ కాళేశ్వరం ద్వారా నింపుతున్న అని చెప్తున్నారన్నారు. నిజానికి నీళ్ళు ఇచ్చింది YSR కదా..YSR ను మరిచి పోవచ్చా..? అని ప్రజల్ని ప్రశ్నించారు. YSR బ్రతికి ఉంటే ఇక్కడ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ వచ్చేదని.. 2400 మెగావాట్ల ప్లాంట్ కోసం 460 ఎకరాల భూ సేకరణ కూడా చేశారన్నారు. పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు ఉందని షర్మిల విమర్శించారు.