By: ABP Desam | Updated at : 27 Apr 2023 04:00 PM (IST)
బీఆర్ఎస్ ప్లీనరీలో ఏడు తీర్మానాలు!
BRS News : దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా BRS ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ ప్రతినిధులసభ పలు తీర్మానాలు చేసింది. తెలంగాణ భవన్లో జరిగిన 22వ పార్టీ ఆవిర్భావ సభ సుదీర్ఘంగా సాగింది. ఈ ప్రతినిధుల సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటగా అధినేత కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. తర్వాత అధినేత కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఇవి పాస్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు.
ఈ తీర్మానాల్లో చాలావరకు జాతీయ రాజకీయాల కోణంలోనే ఉన్నాయి. రైతులు, దళితులు, బీసీల ఉన్నతికి పాటుపడాలని ఒక తీర్మానంలో పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు మెరుగు పరిచే ప్రణాళికపై మరో తీర్మానం చేశారు. మతోన్మాదాన్ని అరికట్టి పౌరులందరూ ఏకం కావాలంటూ బీఆర్ఎస్ విస్తృత సభ మరో తీర్మానం చేసింది. ప్రజల ఆలోచనా సరళి దిశ మళ్లించి, గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని సభ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
తీర్మానం నెం. 1
భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు తగిన విధంగా ఒక సమగ్ర సాగునీటి విధానం రూపొందాలని తీర్మానించారు. తెలంగాణలో నెలకొల్పిన రైతురాజ్యం భారతదేశమంతటా స్థాపించాలని అందులో పేర్కొన్నారు.. ఇందుకోసం అలుపెరగని పోరాటం దిశగా బీఆర్ఎస్ పార్టీ పురోగమించాలని ప్రతినిధుల సభ తీర్మానించింది.
తీర్మానం నెం. 2
హలంపట్టిన చేతులతో కలం పట్టించి చట్టాలను తయారు చేయాలని మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మట్టిని పిసికిన చేతులు మంచి ప్రణాళికలను రూపొందించాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమం వర్ధిల్లే విధంగా దేశంలో నిజమైన రైతు రాజ్యాన్ని నెలకొల్పే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని పార్టీ ప్రతినిధుల సభ మరో తీర్మానానని ప్రవేశపెట్టింది.
తీర్మానం నెం. 3
దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం దేశ విధాన నిర్ణేతగా బీఆర్ఎస్ అవతరించాలని ప్రతినిధుల సభ మరో తీర్మానాన్ని పాస్ చేసింది.
తీర్మానం నెం. 4
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారతదేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ అద్భుతమైన ప్రణాళికలను రచిస్తున్నదని మరో తీర్మానాన్ని ఆమోదించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే దేశంలో భారీస్థాయిలో అద్భుతమైన మౌలిక వసతుల కల్పన జరిపించాలని సభ తీర్మానించింది.
తీర్మానం నెం. 5
ఇంతకాలం వెనుకబాటుకు గురైన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నదని మరో తీర్మానం చేశారు. భవిష్యత్తులో దేశ పరిపాలనా విధానాన్ని నిర్ణయించే శక్తిగా బీఆర్ఎస్ ఎదిగి, శాస్త్రీయంగా జనగణన జరపాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల జనగణన జరిపి, ఆ గణాంకాల ఆధారంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రయోజనాలను అందించాలని తీర్మానంలో కోరారు. అదేవిధంగా కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆ దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని ప్రతినిధుల సభ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
తీర్మానం నెం. 6
మతోన్మాద శక్తుల దుష్పరిపాలన వల్ల అటువంటి దుర్గతి మన దేశానికి పట్టకుండా ఉండాలంటే దేశ యువత వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బిఆర్ఎస్ విస్తృత సభ పిలుపునిచ్చింది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఆటవిక, అనాగరిక, అరాచక సంస్కృతిని రూపుమాపేందుకు, ద్వేషం స్థానంలో ప్రేమను, అసహనం స్థానంలో సామరస్యాన్ని, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్ఠించేందుకు భారతీయ పౌరులందరూ ఏకం కావాలని విస్తృత సభ తీర్మానించింది.
తీర్మానం నెం. 7
ఈ మూసను బద్దలు కొడుతూ నవీన దృక్పథంతో, నూతన చేతనతో దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే లక్ష్యాన్ని బీఆర్ఎస్ స్వీకరించిందని మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీల గెలుపే గెలుపు కాకూడదని, అది ప్రజల గెలుపు కావాలని బీఆర్ఎస్ నమ్ముతున్నదని అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కేవలం ఎన్నికల కోసమో, అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదని తెలిపారు. భారతదేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకే బీఆర్ఎస్ పుట్టిందని.. ఈ దిశగా ప్రజల ఆలోచనా సరళిలోనూ, వారి జీవితాల్లోనూ గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ అప్రతిహతంగా పురోగమించాలని సభ తీర్మానించింది.
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం