TRS Vs BJP : టీఆర్ఎస్ నేత కారు అద్దాలు ధ్వంసం చేసిన అమిత్ షా సెక్యూరిటీ - అసలేం జరిగిందంటే ?
అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డంగా పెట్టిన టీఆర్ఎస్ నేత కారు అద్దాలను భద్రతా సిబ్బంది ధ్వంసం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది.
TRS Vs BJP : కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సిబ్బంది గోసుల శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ నేత కారు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. బేగంపూట టూరిజం హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి ... బేగంపేట హరిత ప్లాజా హోటల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశం కోసం ఆయన హోటల్‌కు వస్తున్న సందర్భంలో ఎంట్రన్స్ గేటు వద్ద ఓ కారు ఆగిపోయి ఉంది. అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయిన ఆ కారు కదల్లేదు. దీంతో అమిత్ షాకు భద్రత కల్పించే ఎస్పీజీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెళ్లి కారును తొలగించాల్సిందిగా కారులో ఉన్న గోసుల శ్రీనివాస్ ను తొందరపెట్టారు.
Telangana | TRS leader Gosula Srinivas parked his car in front of Home Minister Amit Shah's cavalcade in Hyderabad, he was forced to move later after HM's security forced him to do so.
— ANI (@ANI) September 17, 2022
టెన్షన్‌తో వెంటనే కారు తీయలేకపోయానన్న గోసుల శ్రీనివాస్
అయితే అతను తొలగించడానికి ఆలస్యం చేశారు. దీంతో ఎస్పీజీ సిబ్బంది కారు అద్దాలను ధ్వంసం చేశారు. బలవంతంగా గేటుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు తప్పించారు. దీంతో అమిత్ షా కాన్వాయ్ లోపలోకి వెళ్లగలిగింది. కారులో టీఆర్ఎస్ కండువాలు కూడా ఉన్నాయి. బీజేపీ ముఖ్య నేతల సమావేశం పెట్టుకున్న హోటల్‌లోకి టీఆర్ఎస్ నేత తన కారుతో వచ్చి ఎంట్రీకి కారు అడ్డం పెట్టినా చాలా సేపటి వరకూ పట్టించుకోకపోవడం భద్రతా వైఫల్యం అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా కాన్వాయ్ బయలుదేరిన వెంటనే.. రోడ్ క్లియర్ చేస్తారని అలాంటిది గేటు దగ్గర కారు ఉన్నా తీయకపోవడం ఏమిటని బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
కారు అడ్డం పెట్టిన శ్రీనివాస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకునే అవకాశం
గోసుల శ్రీనివాస్ టీఆర్ఎస్ నేతగా గుర్తింపు పొందారు. అయితే తన కారు అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా పెట్టలేదని.. హోటల్లోకి వెళ్తున్న సమయలో ఆగిపోయిందన్నారు. ఈ లోపు అమిత్ షా భద్రతా సిబ్బంది వచ్చి ప్రశ్నించడంతో టెన్షన్‌కు గురయ్యానని పక్కకు తీయడంలో ఆలస్యమయిందన్నారు. ఈ లోపు భద్రతా సిబ్బంది కారు అద్దాలు పగులగొట్టారన్నారు. ఇది అనవసరంగా సృష్టించిన వివాదమని.. తన వైపు తప్పు లేదని ఆయన చెబుతున్నారు. ఇది భద్రతా లోపం కావడంతో గోసుల శ్రీనివాస్‌పై భద్రత పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అది తలచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతయ్, ఆ పరిస్థితి మళ్లీ రావొద్దు - పొంచి ఉన్న ప్రమాదం: కేసీఆర్