అన్వేషించండి

RS Praveen Kumar: పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Telangana News: కొందరు మారుతున్నారు, కానీ తాను మాత్రం గొర్రెను కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.

సీనియర్ నేతలు కే కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడటంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేకే, కడియం పార్టీ మారుతున్నారని, మంచి దారి వెతుక్కోవాలని కొందరు తనకు ఫోన్ చేశారని, కొందరు సందేశాలు పంపించారని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని తనను కోరినట్లు వెల్లడించారు. 

ఎక్కడికో పోవాలన్న ఆలోచన లేదు 
ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను అని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన బీఎస్పీ-బీఆరెస్ కూటమి కోసం ప్రయత్నంచా, తర్వాత బీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నవని తెలిపారు.  తాను రాజకీయాల్లోకి వచ్చింది తన పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, ఆస్తుల కోసమో కాదన్నారు. పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదని స్పష్టం చేశారు. తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని ప్రజా జీవితంలోకి వచ్చానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

‘బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి  ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత, రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్  నాయకత్వంలో నడుస్తున్న బలమైన బీఆర్ఎస్ పార్టీని వేదికగా ఎంచుకున్నాను. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు ఎలాంటి సంశయం లేదు. గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు’ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

దేశంలోను, రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు రాజకీయాలలో అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా అధిగమించినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో పోలీసుల డ్యూటీని ఎవరూ కాదనరు. కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను తిప్పికొట్టాల్సిందే - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ సైనికులకు ఒక విజ్ఞప్తి
రాజకీయాల్లో ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు బీఆర్ఎస్ కు కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఆపలేరు. సమయాన్ని వృదా చేయకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి వాస్తవాలను వివరించి, లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం అని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. 

పదండి ముందుకు.. పదండి తోసుకు..
పోదాం పోదాం పైపైకి…
కదం తొక్కుతూ, పదం పాడుతూ
హృదయాంతరాళం గర్జిస్తూ 
పదండి పోదాం పైపైకి.. అంటూ శ్రీశ్రీ కవిత్వంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Embed widget