అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వేముల రోహిత్ తల్లి - న్యాయం చేయాలని వేడుకోలు

Telangana News: వేముల రోహిత్ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుని ఆత్మహత్య కేసులో తమకు న్యాయం చేయాలని కోరారు.

Rohith Vemula Mother Meet Cm Revanth Reddy: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) విద్యార్థి రోహిత్ వేముల (Vemula Rohit) తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని (Cm Revanth Reddy) కలిశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం సాగడంతో HCUలో తాజాగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.  వేముల రోహిత్ 2016లో వర్సిటీ క్యాంపస్ లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో హెచ్ సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సైతం స్పందించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. రోహిత్ ఆత్మహత్యపై అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

కీలక మలుపు

వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు రోహిత్ ది ఆత్మహత్యగా తేల్చారని, ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని, కేసు మూసివేసినట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్ ఏమి లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు పోలీసులు. రోహిత్ వేముల దళితుడే కాదని సైతం క్లోజింగ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు వైరల్ అయింది. అయితే ఈ కేసుపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల కేసును పునర్విచారణ చేయాలని డీజీపీ రవిగుప్తా నిర్ణయం తీసుకున్నారు.  దర్యాప్తును కొనసాగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ కేసు పునః విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ పోలీస్ శాఖ కోర్టులో పిటిషన్ వేయనుంది.

Also Read: Mynampally Hanmantha Rao : సిద్దిపేటలో రాజీనామా చేస్తే నేనే పోటీ చేస్తా - హరీష్‌కు మైనంపల్లి సవాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget