Revanth Reddy: కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి కఠిన హెచ్చరిక - ఇక అలా చేస్తే శాశ్వత బహిష్కరణే!
Telangana Congress: ఎవరైనా సరే వివిధ హోదాల్లో ఉన్న నాయకులపైన బహిరంగ విమర్శలు చేయడం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy Warning: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ పార్టీ నాయకులకు హెచ్చరికలు చేశారు. పార్టీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్‌లోని విధానాలను వ్యతిరేకించకూడదని అన్నారు. అందరు నాయకుల్ని కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీకి ఐకమత్యమే బలం అని అన్నారు. ఎవరైనా సరే వివిధ హోదాల్లో ఉన్న నాయకులపైన బహిరంగ విమర్శలు చేయడం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి పక్షంలో శాశ్వత బహిష్కరణతో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కఠిన హెచ్చరిక చేశారు. ఈ మేరకు ఆదివారం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
‘‘కాంగ్రెస్ కు ఐకమత్యమే మహా బలం. అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన, వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు.’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం
— Revanth Reddy (@revanth_anumula) April 17, 2022
అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన…వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియా లో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ,క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు.@kcvenugopalmp @manickamtagore @UttamINC @janareddyk @BhattiCLP