KTR Vs Revant : హిమాన్షును మిస్సవుతున్నానని కేటీఆర్ ట్వీట్ - రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ! అసలు ట్విస్టేమిటంటే ?
కేటీఆర్ ఆయన కుమారుడి మధ్య ట్విట్టర్ లో సాగిన ఆప్యాయత ట్వీట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి.
KTR Vs Revant : రాజకీయ నాయకులు ఆఫ్ లైన్ లోనే కాదు.. ఆన్ లైన్ లోనూ అవకాశం దొరకినప్పుడల్లా వాదోపవాదాలకు దిగుతూంటారు. దీనికి సమయం, సందర్భం ఏమీ ఉండదు. ఇలాంటిది తాజాగా ట్విట్టర్‌లో చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ హిమాన్షును ఉద్దేశించి.. మిస్సింగ్ దిస్ కిడ్ అని ఫోటో పెట్టారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది.
Missing this kid ❤️ pic.twitter.com/3I8uwdjlxW
— KTR (@KTRBRS) October 10, 2023
హిమాన్షు ఇటీవలే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కేటీఆర్ స్వయంగా అమెరికా వెళ్లి కాలేజీలో చేర్పించి వచ్చారు. ఇప్పుడు హిమాన్షను సోషల్ మీడియాలో గుర్తు చేసుకుని ట్వీట్ పెట్టారు.
Dadda,
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) October 11, 2023
It feels extremely abnormal for me from meeting you once a day to virtually interacting with you, or from having a meal once a week to craving one for months. But as you said “Success seeks sacrifice” which is a true testament of your journey throughout the years! I’m… https://t.co/Qx26zTVLY7
కేటీఆర్ ట్వీట్‌కు హిమాన్షు కూడా రిప్లయ్ ఇచ్చారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చే్సుకున్నారు. విజయం త్యాగాల్ని కోరుతుందని కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే ఈ తండ్రి కొడుకుల ట్వీట్లకు ఊహించని కౌంటర్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? నిరుద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? అని ప్రశ్నించారు. మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? అని ట్వీట్ చేశారు.
దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్..
— Revanth Reddy (@revanth_anumula) October 11, 2023
కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా..
ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని,
లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా?
సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక… https://t.co/FlIdXeE90C
ఈ ట్వీట్ లన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.