అన్వేషించండి

Revanth Reddy: నన్ను దొంగ దెబ్బ తీసే కుట్ర జరుగుతోంది - కొడంగల్‌లో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana News: కొడంగల్‌ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Kodangal News: తనను దొంగ దెబ్బతీయడం లక్ష్యంగా తెరవెనుక గూడు పుఠాణి జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని పడేయాలని కొంత మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని అన్నారు. కొడంగల్‌ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో తన ప్రతిష్ఠను తగ్గించడం కాదని.. కొడంగల్ ప్రతిష్ఠను దెబ్బతీయడం అని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని అన్నారు. ‘‘రేపు ఏదైనా తప్పిదం జరిగితే క్రిష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతుంది. కొడంగల్ లో వచ్చే సిమెంటు ఫ్యాక్టరీ, నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం, పాలమూరు - రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా పోవడం లాంటి నష్టాలు ఎన్నో జరుగుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. 

డీకే అరుణ ఎలాగైనా సరే తనను దెబ్బతీయాలని, తూట్లు పొడిచి తన ఇజ్జత్ తీయాలని చీకట్లో తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపు ఇచ్చారు. పాలమూరు పార్లమెంటు సీటుకు కొడంగల్ నుంచి భారీ మెజారిటీ రావాలని కోరారు. వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రజల సిపాయిగా ఢిల్లీలో ఉండి పని చేస్తాడని రేవంత్ రెడ్డి అన్నారు.

‘‘రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి? మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్, వెటర్నరీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కిందపడేయాలా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి నారాయణపేట ఎత్తిపోత పథకంతో ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నందుకు కిందపడేయాలా? సిమెంటు ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు కింపడేయాలా? ఎందుకు నన్ను కిందపడేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మన గౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు చూశారు. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. సోనియమ్మ నాయకత్వంలో ఈరోజు రూ.5 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. కొడంగల్ నుంచి పాలమూరు ఎంపీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ ఇచ్చి అందరి కుట్రలు, కుతంత్రాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget