అన్వేషించండి

Revanth Reddy: బీఆర్ఎస్‌ విమర్శలకు చెక్ పెట్టిన రేవంత్! తెలంగాణ తల్లి విగ్రహంపై కీలక నిర్ణయం

Telangana Talli: తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాకుండా లోపల ఉండడమే సముచితమని సీఎం రేవంత్ అన్నారు. డిసెంబర్ 9న ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు.

Telangana Secretariat News: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. 2024 డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని, నైతికతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దార్శనికుడికి ఘన నివాళి అర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు.

రాజీవ్ గాంధీ ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్ఠంగా మారిందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు కూడా రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్నవే అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. యువతకు ఆదర్శపాయుడైన రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడని, అలాంటి స్ఫూర్తిమంతమైన నాయకుడి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్టించుకోవడం ఎంతైనా సముచితమని అన్నారు. త్వరలోనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రాజీవ్ గాంధీ ఆశయాల మేరకు యువతను అన్ని రంగాల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం తలపెట్టిందని, అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మారుమూల తండాలు, గూడేల్లో, అలాగే పట్టణాల్లో మరుగునపడి ఉన్న మెరికల్లాంటి క్రీడాకారులను వెలికితీస్తామని, త్వరలో ప్రారంభంకానున్న యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వారికి శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయ వేదికలపై దేశానికి మెడల్స్ తెచ్చేవారుగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలువురు క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget