అన్వేషించండి

Revanth Reddy: "ఓఆర్ఆర్ ను కొల్లగొట్టేందుకు కేటీఆర్ కుట్ర చేస్తుంటే, వాళ్లంతా సాయం చేస్తున్నరు"

Revanth Reddy: మంత్రి కేటీఆర్ ఓఆర్ఆర్ లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం కేసీఆర్, సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్ లు ఆయనకు సహకరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 

Revanth Reddy: లక్ష కోట్ల విలువ కల్గిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ను కొల్లగొట్టేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తుంటే.. సీఎం కేసీఆర్, సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్ లు ఆయనకు సహకరిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ల టోల్ కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయని కేటీఆర్ చెప్పిన సంస్థకు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని తెలిపారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వేల కోట్ల విలువైన కాంట్రాక్టులపై ఎలా సంతకాలు చేస్తారని ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ కాంట్రాక్టును చూపి ఐఆర్బీ సంస్థ దాని 49 శాతం వాటాను సింగపూర్ సంస్థకు వేల కోట్లకు అమ్మేసుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఐఆర్బీ సంస్థకు, సింగపూర్ సంస్థకు, షెల్ సంస్థకు ఉన్న లింకులేంటో తేలాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అని అన్నారు. అక్రమంగా సంపాధించుకున్న వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ యూకే, యూఎస్ఏలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. 

కేటీఆర్ బ్రిటన్ వెళ్లినప్పుడు రాజులు ఎక్కడున్నారు?

విదేశీ పర్యటనల్లో వారికి అవసరమైన గూడు పుఠాణీ సమావేశాలు పెట్టుకుంటున్నారని కేటీఆర్ బ్రిటన్ పర్యటకు వెళ్లినప్పుడు రాజులు ఎక్కుడ ఉన్నారో ఆ వివరాలను ప్రభుత్వం బయట పెట్టగలదా అని ప్రశ్నించారు. ఎల్లుండి లోపే ఐఆర్బీ సంస్థ 10 శాతం హెచ్ఎండీఏకు చెల్లించాలని లేకపోతే నిబంధనలు ప్రకారం వెంటనే టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ కాంట్రాక్టుకు వెనక ఉన్న మర్మం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చెబుతున్నారని ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇంత దోపిడీ జరుగుతుంటే కేంద్ర హోంశాఖను విచారణ చేయమని ఎందుకు కోరడం లేదని అడిగారు. ఇంత అవినీతి జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ, కాగ్ సంస్థలకు ఇస్తామన్నారు. 111 జీవో ఎత్తివేత వెనక ఉన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేశాకే జీవో ఎత్తివేశారని ఆరోపించారు. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేతపై ఎన్జీటీకీ వెళ్తామన్నారు. ఏ పార్టీ నేతలైనా సరే ఈ జీవో పరిధిలో భూములు కొన్న వారి వివరాలను బయట పెట్టాలని అన్నారు. 

కేసీఆర్ వ్యతిరేకత ఆధారంగానే రేవంత్ రాజకీయం ! 

రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవడం.. పదవులు పొందడం కాదు ముందు కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేద్దామని కలిసి రమ్మని పిలుపునిస్తున్నారు. అంతా కేసీఆర్ బాధితులే కావడంతో ఆ వైపు నుంచి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే  కేసీఆర్ ను ఎవరు ఓడించగలరో ఆ పార్టీలోనే చేరుతానని చెబుతూ వచ్చారు. ఈటల రాజేందర్ లక్ష్యం కూడా కేసీఆర్ ను ఓడించడమే. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు ఆ పార్టీ ఎంతో  కొంత రేసులోకి వస్తుందని నమ్మకం పెట్టుకోలేకపోయారు. కానీ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితి మారిందని నమ్ముతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ప్రజల్లో మార్ప కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ కు రెండు సార్లు చాన్సిచ్చాం కదా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్  కు ఈ సారి అవకాశం ఇద్దాం అనే భావన ప్రజల్లో వస్తే.. . ఎన్నికలు ఏకపక్షంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజల్లో అలాంటి భావన రావాలంటే కాంగ్రెస్ బలంగా ఉందని..గెలుస్తుందన్న నమ్మకం రావాలి. అలాంటి భావన రావాలంటే రికలు పెరగాలి. అందుకే రేవంత్.. కేసీఆర్ ను ఓడిద్దాం రమ్మని పిలుస్తున్నారు.

Also Read: పేర్లు పెట్టి మరీ నేతలకు పిలుపులు - గెలిచే పార్టీ ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి చేరికల వ్యూహాలు ?

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget