అన్వేషించండి

Revant Reddy : రైతు బంధు ఎగ్గొట్టేందుకు కేసీఆర్ కుట్ర - రేవంత్ రెడ్డి రివర్స్ ఆరోపణలు !

రైతుబంధును ఎగ్గొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపునే రైతు బంధు నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు.

 

Revant Reddy :  సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా  అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే విడుదల చేయాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్ అన్నారు.   సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.  రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని..  రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని రేవంత్ ఆరోపించారు.  కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారన్నారు.  అంజనీ కుమార్ ను, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పామని.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మేం చెబుతుంటే.. బీఆరెస్ మాపై విష ప్రచారానికి దిగిందని ఆరోపించారు.                           

కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే  కాంగ్రెస్ రాగానే చెల్లిస్తుందన్న రేవంత్            

ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.  కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని.. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసినా....బీఆరెస్ ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరరని స్పష్టం చేశారు.  మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.  నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయయని..  కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.  క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. 

మేడిగడ్డ రిపోర్టు ఎందుకు బయట పెట్టడం లేదు ? 

డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను ఎందుకు  బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.  కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలన్నారు.  కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదన్నారు.  మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్,  కేటీఆర్ బిల్లా రంగా లాంటివారు.. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని।.   వాళ్ళేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.  ఈడీ,  ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు అన్నారు. 

దళిత బందు, రైతు  బంధు ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు      

రైతు బంధు, దళిత  బంధు పథకాలను ఆపాలని రేవంత్ రెడ్డి ఈసీకి పిర్యాదు చేశారని..  కాంగ్రెస్ పార్టీ రైతుద్రోహి, దళిత ద్రోహి బీఆర్ఎస్ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సాకుతో చెల్లింపులు ఆపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. రెండో తేదీ లోపు సంక్షేమ పథకాల లబ్దిదారులందరికీ చెల్లింపులు చేయాలనేది తమ విధానమని రేవంత్ చెబుతున్నారు. ఈ అంశపై రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ఓటర్ల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవద్దని కాంగ్రెస్ అంటోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget