By: ABP Desam | Updated at : 18 Jan 2023 07:21 PM (IST)
కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర - ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేస్తారన్న రేవంత్
Revant Reddy : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయని.. ఈ కారణంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకోవడానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో 25 నుంచి 30 సీట్లు ఓడించడానికి ఆయనతో బేర సారాలు చేసింది నిజం కాదా ?.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కు నోప్పేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారని.. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని మండిపడ్డారు. ఇంత నీచమైన పనికి పూనుకున్న కేసీఆర్ ఈ సమాజానికి చీడ పురుగో కాదో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ నిజ స్వరూపం తెలిసే కుమారస్వామి నీ సభకు హాజరు కాలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలకు కాలం తప్పక సమాధానం చెబుతుంది... కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ టీఆరెస్ పార్టీ పేరు ఎలాగై మార్చుకోవచ్చు కానీ.. కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీ తో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆరెస్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. యూపీలో అఖిలేష్ ను గెలిపించాలని ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీని గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. డి.రాజా, కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, అఖిలేష్ యాదవ్ బీఆరెస్ సభలో పాల్గొన్నారు. వీళ్లంతా ఒక బృహత్ ప్రణాళిక తో ముందుకు వస్తారని చివరి వరకు గమనించా.. కానీ కాంగ్రెస్, బీజేపీ లను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారన్నారు.
దేశంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది...245 టీఎంసీల సామర్ధ్యంతో నాగార్జున సాగర్ ను నిమించింది. లక్ష 45 వేల గ్రామాలకు కరెంట్ .. 1లక్ష తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ది.. పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాంగ్రెస్ , ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా లను ప్రారంభించింది కాంగ్రెస్ అన్నారు. మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్? అని రేవంత్ ప్రశఅనించారు.
మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్నారు.. కానీ గజ్వేల్ లో మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే..ఎనిమిదేళ్లలో 25 లక్షల పంపుసెట్లు రైతులు ఎందుకు ఉపయోగిస్తారు.. రైతులకు 24 గంటల కరెంటు అవసరం ఎందుకు ఉంటుందన్నారు. మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను దూశిస్తున్నది నిజం కాదా కేసీఆర్ వఅని ప్రశ్నించారు. 65 మంది ప్రధానులు కలిసి 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎనిమిదేళ్లలో మోడీ100 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులు మూతవేశాని ఇతర వాటిని ప్రారంభిస్తామని చెబుతున్నారని ఎద్దేా చేశారు.
కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోందని.. రాజకీయస్వార్థంకోసం, ఆర్ధిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మే నాయకుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు.. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదని.. ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
IND Vs NZ 2nd T20I Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ - భారత్కు చావో రేవో!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !