అన్వేషించండి

Caste Census : కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ ద్రోహులే - రాహుల్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి - రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana : జనాభా కులగణనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణననుపార్టీ క్యాడర్, లీడర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Telangana :   గాంధీ భవన్ లో కుల గణనపై అవగాహన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నార.  తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని..  సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు.  రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియా  సఫలీకృతం అయ్యారని..  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని రేవంత్ తెలిపారు.  గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత లఅన్నారు. 

రేవంత్ రెడ్డి రెడ్డినా, మహేష్ గౌడ్ గౌడా అనేది కాదు.. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చింది.  మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది.. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు...  చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని స్పష్టం చేశారు.  పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ ని బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించుకున్నామన్నారు. 

పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా... ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ పై ఉందని రేవంత్ సూచించారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలన్నారు.  బాధ్యతగా పని చేయండి... మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది..రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని హెచ్చరించారు.  దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.  తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేసేలా ఉంటుంది. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని సలహా ఇచ్చారు. 

తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది.. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని  భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా  మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామన్నారు.   ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు  అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు.  కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు... సెలక్ట్ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారని రేవంత్ తెలిపారు.  57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారన్నారు.  పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని.. 
ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Nandamuri Taraka Ramarao First Darshan: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Embed widget