అన్వేషించండి

Revant Vs TRS : నిన్నటి దాకా టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి.. ఇప్పుడు కాంగ్రెస్‌.. ఫలిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్లాన్..!

తెలంగాణ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని గట్టిగా చెప్పుకునే బీజేపీని కొత్త పీసీసీ చీఫ్ మెల్లగా సైడ్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసి.. ఆ పార్టీ ఫోకస్ కాంగ్రెస్‌పైన ఉండేలా చూసుకుంటున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మొదటి టాస్క్‌ను చాలా సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టేశారు. ఇంద్రవెల్లి సభలో ఆయన టీఆర్ఎస్‌పై చేసిన విమర్శలు.. సీఎం కేసీఆర్‌పై దూకుడుగా అన్న మాటలు ఊహించిన దాని కన్నా ఎక్కువ రియాక్షన్స్ ఇచ్చాయి. చివరికి టీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి... కాళ్లు , చేతులు నరుకుతాం అనే దాకా వచ్చారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ ఎమోషన్‌నే ఆశించారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. 

నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరాటం..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి దుర్భర పరిస్థితుల్లో ఉంది.  ఎలాంటి ఎన్నిక జరిగినా కనీసం పోటీలో లేని పరిస్థితి ఉండేది. దానికి కారణం బీజేపీ వ్యూహం. అటు దుబ్బాకలో కానీ.. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో కానీ బీజేపీ వ్యూహాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించదు.. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు.. బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్లుగా ప్రచారం చేశారు. దుబ్బాకలో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు. కానీ అక్కడ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారాన్ని బలంగా చేయడం... టీఆర్ఎస్ కూడా ఆ పార్టీని టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిపోయింది. అదే వ్యూహాన్ని గ్రేటర్‌లోనూ అమలు చేశారు. టీఆర్ఎస్‌ను నేరుగా .. దూకుడుగా ఢీకొట్టడంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఫలితాలు కూడా అలానే వచ్చాయి. రాజకీయ చిత్రం మెల్లగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. 

ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్..!

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మొదట ఇదే సమస్యను గుర్తించారు. పరిష్కరించాలని అనుకున్నారు. అప్పట్నుంచి సీన్ ను టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మార్చాలని నిర్ణయిచుకున్నారు. టీఆర్ఎస్ పాలనపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌పై అవసరమైనప్పుడల్లా వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. మొదట్లో టీఆర్ఎస్ పెద్దగా కౌంటర్లు ఇవ్వలేదు కానీ.. ఆయన మాటలు ప్రజల్లోకి బాగా వెళ్తూండటంతో  గట్టిగా కౌంటర్లు ఇవ్వక తప్పడం లేదు. ఇప్పుడు అది తారస్థాయికి చేరింది. రేవంత్ తో.. కాంగ్రెస్‌తో తేల్చుకుంటామని టీఆర్ఎస్ అనే పరిస్థితి వచ్చింది. 

బీజేపీని వ్యూహాత్మకంగా  లైట్ తీసుకుంటున్న రేవంత్..! 

రేవంత్ వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారు. ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీనికి కారణం ఆ పార్టీకి అనవసరంగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. రాజకీయం మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగితే... టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కాంగ్రెస్‌లో చూస్తారని ..అప్పుడు బీజేపీకి కనీస ఓటు బ్యాంక్ కూడా ఉండదని విశ్లేషిస్తున్నారు. అందుకే  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో బీజేపీపై కనీస విమర్శలు కూడా రేవంత్ రెడ్డి చేయలేదు. బీజేపీతో కుమ్మక్కయ్యారని కొంతమంది విమర్శలు చేయవచ్చు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారనేది అసలు రాజకీయం అని భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
How to Escape from Locked Car: ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
Embed widget