Weather Updates: ఎల్లో అలర్ట్.. ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు

Rains In AP Telangana: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

FOLLOW US: 

Rains In Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు సైతం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరిగింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. జనవరి 15 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైతం వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జంగమేశ్వరపురంలో 20 డిగ్రీలు, కళింగపట్నంలో 19.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలోని రాయలసీమలో నేడు తేలిక పాటి జల్లు కురవనున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 15 వరకు రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సీమలోని ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు, నంద్యాలలో 20 డిగ్రీలు, తిరుపతిలో 20.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా చలి గాలుల ప్రభావం అధికమైంది. రాయలసీమకు మాత్రం ఎలాంటి అలర్ట్ జారీ కాలేదు. 

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో గత ఐదారు రోజుల నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 

Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! నేడు ఎగబాకిన పసిడి ధర.. అతి భారీగా పెరిగిన వెండి రేటు.. ఇవాళ ఇలా..

Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Jan 2022 07:03 AM (IST) Tags: telangana rains hyderabad rains telangana rains rains in telangana Weather Updates ap rains rains in ap ap weather updates telangana weather updates AP Temperature Today Telangana Temperature Today

సంబంధిత కథనాలు

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

AP PCC Chief Kiran :  ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

LGP Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు

LGP Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!