అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Money Sieze: పోలీస్ తనిఖీల్లో నగదు సీజ్ చేశారా.? - ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లో డబ్బు వాపస్

Money Sieze: తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. అయితే, సరైన పత్రాలు చూపించి 48 గంటల్లోనే మీ సొమ్ము తిరిగి తీసుకోవచ్చని ఈసీ పేర్కొంది.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్ చేస్తున్నారు. ఎవరి వద్దనైనా రూ.50 వేలకు పైగా నగదు, 10 గ్రాములకు పైగా బంగారం కనిపిస్తే స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, ఈ తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది. బాధితులు సదరు సొమ్మును తిరిగి పొందేందుకు ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్ ఛైర్మన్ ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే మీ నగదును తిరిగి ఇచ్చేస్తారు. అయితే, వీటి విలువ రూ.10 లక్షల్లోపు మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వివరాలు వెల్లడించాలి. వారు చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో రోజుకు పదికి పైగా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు.

డబ్బులు ఇలా తిరిగి పొందండి

  •  తనిఖీల్లో మీ బంగారం, నగదును పోలీసులు పట్టుకుంటే సంబంధిత ఠాణాలో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. ఆ సమాచారాన్ని సంబంధిత యజమానులకు తెలియజేస్తారు. 
  • ఈ వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్, ఆదాయపు పన్ను అధికారులకు పంపిస్తారు.
  • వీటిని తిరిగి పొందాలనుకునేవారు పోలీస్ కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు గ్రీవెన్స్ సెల్ కు బదిలీ చేస్తారు. 
  • అనంతరం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన ఓ రశీదు ఇస్తారు. అనంతరం తమ సెల్ అధికారులు ఫోన్ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
  • 48 గంటల్లోపు సదరు బాధితులను పిలిచి వారు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలియజేస్తారు.
  • ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సీజ్ చేసిన సొమ్మును తిరిగిచ్చేయాలని సంబంధిత ఠాణాకు ఆదేశాలిస్తారు. బాధితులు అక్కడికి వెళ్లి మీ నగదు తీసుకోవాల్సి ఉంటుంది.
  • అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేల కన్నా ఎక్కువ నగదును ప్రజలు తమ వెంట తీసుకెళ్లొద్దని, అత్యవసరమై తీసుకెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలు, సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రూ.243 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం

మరోవైపు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తంగా రూ.103 కోట్ల విలువైన నగదు సీజ్ చేయగా, ఈసారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపు సొమ్ము పట్టుకోవడం గమనార్హం. గురువారం ఒక్క రోజే తనిఖీల్లో రూ.78.03 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో రూ.120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గత 24 గంటల్లో 83 కిలోల బంగారం, 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget