అన్వేషించండి

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Telangana Cabinet Meeting: అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకే కొనుగోలు, సన్న వడ్లకు రూ.500 పంట బోనస్ ఇస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Ponguleti Srinivas Reddy about key decisions in Telangana Cabinet Meeting | హైదరాబాద్: ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎన్నికల సంఘం పర్మిషన్ తో తెలంగాణ మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. రాష్ట్ర రైతులకు సీజన్ ప్రారంభం కాబోతోంది, పండించిన ధాన్యం సమస్య ఉంది, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ నివేదిక ఇచ్చింది. దానిపై చర్చించేందుకు కేబినెట్ భేటీ అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

3 రోజుల్లోనే నగదు జమ కాంగ్రెస్ సర్కార్ ఘనత 
యాసంగిలో రైతుల పండించిన ధాన్యం సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజులలోపే గతంలో రైతులకు ఎన్నడూ లేనట్లుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడూ ధాన్యాన్ని ఇలా సేకరించలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధాన్యం వేగంగా సేకరించడంతో పాటు 3 రోజుల్లోపే నగదు జమ చేశామన్నారు. అకాల వర్షాలతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ధాన్యం తడిచిపోయింది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ధాన్యం తడిచిన రైతులు ఆందోళన చెందవద్దని, కనీస మద్ధతు ధరకే కొంటామని భరోసా ఇచ్చారు.

రైతులకు వచ్చే సీజన్ నుంచి రూ.500 పంట బోనస్ 
మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, రేషన్ బియ్యం, ఇతర పథకాలు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పినట్లు చేస్తామన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు వచ్చే సీజన్ నుంచి క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇస్తామని ప్రకటించారు. విత్తనాలు, ఎరువులు, రైతులకు సంబంధించి ఇతరత్రా అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం. అధికారిక కంపెనీల ద్వారా విత్తనాలు కొనుగోలు చేయాలని, రిసీప్ట్ ను పంట వచ్చే వరకు భద్రపరుచుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 

జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.600 కోట్లు వెచ్చించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. స్కూళ్లను మోడ్రన్ పాఠశాలలుగా చేసి చూపించడం ఇందిరమ్మ పాలన అన్నారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి శ్రీధర్ బాబును అధ్యక్షుడిగా నియమించామని చెప్పారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారం.. మేడిగడ్డ పగుళ్లు, అన్నారం లీకేజీ, మూడో డ్యామ్ ప్రమాదం ఉందని కనుక.. చుక్క నీరు ఆపోద్దని గేట్లు తెరవాలని రిపోర్టులో ఉందన్నారు. ఫిజికల్‌గా, టెక్నికల్ గా డ్యామ్ సేఫ్టీ గురించి ఆరుగురితో కమిటీ ఉంది. టెస్టులు చేపించే వరకు డ్యామ్ జోలికి వెళ్లకూడదని రిపోర్టులో ఉంది. ప్రతిచోట కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన రెండు కంపెనీతో పరీక్షలు చేపించి, రిపోర్ట్ తరువాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు. 

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ, ఈసీకి లేఖ

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ. రాష్ట్రం ఏర్పడి ఈ జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తి కానుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ తీర్మానం చేశారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల కలను నెరవేర్చిన సోనియా గాంధీని రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా వేడుకకు ఆహ్వానించి సన్మానిస్తాం అన్నారు. ఇందుకోసం ఈసీకి లేఖ రాయాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వమని.. రైతుల గురించి ప్రధాన ప్రతిపక్షం అబద్ధాలు చెబుతోందని గుర్తించాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Embed widget