News
News
X

Farmhouse Case : సిట్ దర్యాప్తు చెల్లదన్న ఏసీబీ కోర్టు - హైకోర్టులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్!

ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తు చెల్లదన్న ఏసీబీ కోర్టు ఆదేశాలపై పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

FOLLOW US: 
Share:

Farmhouse Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో  బీఎల్ సంతోష్ , తుషార్, జగ్గూ స్వామిని నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించడంపై సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, పోలీసులు, సిట్ కు ఆ అధికారం లేదన్న కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ దాఖలు చేసిన ఈ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణకు హైకోర్టు అనుమతించింది.  బుధవారమే విచారణ జరపనుంది. 

సిట్ విచారణ చేయడం చెల్లదన్న ఏసీబీ కోర్టు 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌‌‌‌, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్‌‌ను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్‌‌కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి జి.రాజగోపాల్‌‌ తేల్చి చెప్పారు. ప్రివెన్షన్‌‌ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌‌(పీసీ యాక్ట్) గ్రౌండ్‌‌లో సిట్‌‌ దాఖలు చేసిన మెమోను తిరస్కరించారు. పీసీ యాక్ట్‌‌ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పోలీసులకుగానీ, సిట్‌‌కుగానీ ఇన్వెస్టిగేషన్​ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్‌‌‌‌, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌‌ను నిందితులుగా చేర్చాలంటూ గత నెల 22న సిట్‌‌ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్‌‌ చేయగా.. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది. కేసు దర్యాప్తులో ఈ అంశం కీలకం కావడంతో సిట్ అధికారులు వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఏసీబీ సెక్షన్ల కింద కేసు - విస్తృత విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

ఈ కేసును మొదట సైబరాబాద్ పోలీసులు ట్రాప్ చేశారు. నిందితుల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత ఏసీబీ చట్ట కింద కేసులు నమోదు చేశారు. మరింత విస్తృతమైన దర్యాప్తు చేయాల్సి ఉన్నందున సీనియర్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ని ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (SIT)లో ​ సభ్యులుగా నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్​ క్రైమ్స్​ డీసీపీ కమలేశ్వర్​ , నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్​ ఏసీపీ గంగాధర్​, శంషాబాద్​ డీసీపీ జగదీశ్​రెడ్డి, మొయినాబాద్​సీఐ లక్ష్మిరెడ్డి ఉన్నారు. వీరు పలువురు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలుపుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో సోదాలు కూడా చేశారు. అయితే ఎవర్నీ పట్టుకోవడం కానీ అరెస్టులు చేయడం కానీ ఇంత వరకూ చేయలేకపోయారు. 

సిట్ భవితవ్యం తేల్చనున్న హైకోర్టు 

ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయకూడదని ఏసీబీ కోర్టు చెప్పడంతో ...  దర్యాప్తు ముందుకెళ్లడం కష్టంగా మారింది. సిట్ అధికారులు ఇంకెవరికీ నోటీసులు జారీచేసే అవకాశం ఉండదు. అలాగే దర్యాప్తు చేయలేరు. కేసును ఏసీబీకి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది.  అయితే ఇప్పుడు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున .. సిట్ దర్యాప్తు ఆగిపోతే సమస్యలు వస్తాయని.. దర్యాప్తు కొనసాగేలా చూసుకోవాలని సిట్ ప్రయత్నం చేస్తోంది. 

Published at : 07 Dec 2022 01:27 PM (IST) Tags: Farm House Case ACB Court ACB court that SIT investigation is invalid

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి

Breaking News Live Telugu Updates: ఎస్సారెస్పీ కెనాల్ లో పడిపోయిన కారు... యువకుడు మృతి

Telangana: 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రుల శంకుస్థాపన, దసరా నాటికి నిర్మాణం పూర్తి

Telangana: 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రుల శంకుస్థాపన, దసరా నాటికి నిర్మాణం పూర్తి

BRS Party : పొంగులేటితో భేటీ, 20 మంది బీఆర్ఎస్ నాయకులపై అధిష్ఠానం వేటు

BRS Party : పొంగులేటితో భేటీ, 20 మంది బీఆర్ఎస్ నాయకులపై అధిష్ఠానం వేటు

MP Uttam Kumar Reddy : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు- ఉత్తమ్ కుమార్ రెడ్డి

MP Uttam Kumar Reddy : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు- ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!