అన్వేషించండి

Phone Tapping Case: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు - కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బండిసంజయ్‌ను బాధితుడిగానూ, ఓ సాక్షిగానూ విచారించాలని నిర్ణయించింది. ఈ నోటీసులు జారీ వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటీ?

Phone Tapping Case: ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుల విచారణ బీఆర్ఎస్ ముఖ్య నేతలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి, ఈ కేసును విచారిస్తున్న సిట్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో బండి సంజయ్ స్వయంగా తన ఫోన్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో, ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో ఆయన్ను బాధితుడిగానూ, ఓ సాక్షిగానూ విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే, ఈ నోటీసులు జారీ వెనుక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పక్కా కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా చెబుతున్నారు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టల వ్యూహం

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా రెండు రాజకీయ లక్ష్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేందుకు ఉపయోగపడుతుందని అర్థం అవుతోంది. అవేంటో తెలుసుకుందాం.

బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టడం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాప్ చేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా, కీలక ప్రతిపక్ష నేతలంతా కేసీఆర్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ విషయంలో విచారణ ప్రారంభించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, ఎస్.ఐ.బీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ డీసీపీ రాధా కిషన్ రావు, అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్నను సిట్ విచారణ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, వికారాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత పటోళ్ల మహిపాల్ రెడ్డి సిట్ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. వై.ఎస్ షర్మిళ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. దీని ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నేతలందరి ఫోన్లను అక్రమంగా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసిందని ప్రజల ముందు చెప్పే ప్రయత్నం ఇది.

బండి సంజయ్ పలు మార్లు తన ఫోన్‌ను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ప్రతిపక్ష నేతగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీని భాగస్వామిగా చేయడం ద్వారా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఈ విషయాన్ని బలంగా ఉపయోగించుకోవడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా చెప్పవచ్చు. దీంతోపాటు, బండి సంజయ్ వంటి కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు తిలోదకాలిచ్చారని, నేతల గోప్యతను హరించిన ప్రభుత్వంగా బీఆర్ఎస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వ్యూహం ఇందులో దాగి ఉంది. కీలక ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ముఖ్య సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్య నాయకులే అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చి ఈ కేసులో సాక్షిగా పిలవడం అంటే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై చర్యలకు మార్గం సుగమం చేసే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలోకి బీజేపీని కూడా లాగడం మరో వ్యూహం

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, ఈ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం కేవలం బీఆర్ఎస్‌ను దెబ్బ తీయడం మాత్రమే కాకుండా, బీజేపీని కూడా ఇందులోకి లాగే వ్యూహం కనిపిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ కేసు ద్వారా బీజేపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం కనిపిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ గట్టిగా మాట్లాడకపోతే, బీజేపీ - బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ప్రజల ముందు ఆ పార్టీని ఎండగట్టే అవకాశం కలుగుతుంది. ఒకవేళ బీజేపీ నేతలు గట్టిగా మాట్లాడితే, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌కు నైతిక మద్దతు దొరికినట్లు అవుతుంది. కేవలం బీఆర్ఎస్ పై కోపంతో తాము ఈ చర్యలకు దిగలేదని, అటు కాంగ్రెస్-బీజేపీ వంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం అతి పెద్ద కుట్రగా అన్ని పార్టీలు భావిస్తున్నాయని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తోంది. ప్రజల్లో ఇది ప్రతీకార కేసుగా కాకుండా, తాము పారదర్శకంగానే ఈ కేసు విచారణ చేపడుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఈ కేసులో తీవ్రంగా స్పందించకపోతే మాత్రం, బీఆర్ఎస్ - బీజేపీలు కుమ్మక్కయ్యాయని ప్రజల ముందు చెప్పే అవకాశం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి బీఆర్ఎస్‌ను కాల్చడం అని చెప్పాలి. రాజకీయంగా బీజేపీ-బీఆర్ఎస్‌లను ఈ వ్యూహంతో డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని చెప్పాలి.

బీఆర్ఎస్, బీజేపీలను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా ఇరుకున పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ లక్ష్యమని తెలుస్తోంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget