అన్వేషించండి

Seethakka review: ఇది నాకు రెండో జీవితం- ఇదంతా బోనస్‌- సోదరిలా చూడాలని ఉద్యోగులకు సీతక్క సూచన

మంత్రి సీతక్క తన శాఖపై సమీక్షలు మొదలుపెట్టాడు. మిషన్‌ భగీరథ్‌పై ఫోకస్‌ పెట్టారు. సమీక్షా సమావేశానికి హాజరైన సీతక్కకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. సీతక్కతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్మితా సబర్వాల్‌.

Grand welcome to Seethakka: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మళ్లీ తన మార్క్‌ చూపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తన డిపార్ట్‌మెంట్‌లోని  ఉద్యోగులతో కలిసిపోయారు. తనను ఒక మంత్రిగా కాకుండా సోదరిలా చూడాలంటూ సూచించారు. మంత్రి అయినంత మాత్రాన.. తతను ప్రత్యేకంగా చూడాల్సి అవసరం  లేదని... అందరిలో ఒకరిగా భావించాలని చెప్పారు. తమ ముందు పెద్ద టాస్క్‌ ఉందని... ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.  తొలిసారి సమీక్షా సమావేశానికి వచ్చిన మంత్రి సీతక్కకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీతక్క.

తెలంగాణలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేట్టిన తర్వాత... తన శాఖల పరిధిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు సీతక్క. తొలిసారి గ్రామీణ  ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో రివ్యూ చేశారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో  సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఏఎస్ అధికారిణి, మిషన్ భగీరథ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా హాజరయ్యారు. సమీక్ష సమావేశం నిర్వహించడానికి  అక్కడికి వచ్చిన సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు ఘనస్వాగతం పలికారు. కరతాళ ధ్వనులతో... ఆమెను ఆహ్వానించారు. తనకు  ఘనస్వాగతం పలికిన ఉద్యోగులకు ఆప్యాయంగా పలకరించారు మంత్రి సీతక్క. మహిళా ఉద్యోగుల దగ్గరకు వెళ్లి.. నవ్వుతూ మాట్లాడారు. అందరికీ అభివాదం చూస్తే  పరిచయం చేసుకున్నారు. ఈ వీడియోను సీతక్క తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోతో పాటు తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు ఒక సందేశం కూడా ఇచ్చారు మినిస్టర్‌  సీతక్క. తన క్యాబినెట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు తనను మంత్రిగా కాకుండా సోదరిలాగా చూడాలని కోరానని చెప్పారు. తమ ముందు పెద్ద పని ఉందని... ప్రతి గ్రామంలో రోడ్లు,  తాగునీటి సౌకర్యాలపై అత్యంత ప్రాధాన్యత ఉంచాలని చెప్పారు. తనకు ఘనస్వాగతం పలికిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు.

పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క.. ముందుగా మిషన్‌ భగీరథపై ఫోకస్‌ పెట్టారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి  సరఫరా ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాలపై రివ్యూ నిర్వహించారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి... స్మితా సబర్వాల్ మంత్రి సీతక్కకు వివరించారు.  గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీతక్క. ప్రతి గ్రామానికి రోజువారి నీటి సరఫరా జరిగేలా చర్యలు  చేపట్టాలన్నారు. వేసవి కాలం రాబోతోంది... ఆ సమయంలోనూ నీటి ఎద్దడి రాకుండా చూడాలని... ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లు,  నదులతోపాటు నీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ఇక.. మంత్రి సీతక్కతో ఐఏఎస్ అధికారిణి, మిషన్ భగీరథ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని ఫైళ్ళపై సీతక్కతో సంతకాలు తీసుకున్నారు. దీంతో సీతక్క నిర్వహిస్తున్న శాఖల్లో స్మితా సబర్వాల్‌ పోస్టింగ్ ఖరారైందా అన్న చర్చ జరిగింది. అయితే... మిషన్‌ భగీరథ కోసం తాము ఆమె బృందంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామంటూ... స్మితా సబర్వాల్ ట్వీట్‌ చేశారు. మిషన్ భగీరథకు సంబంధించిన అధికారిణిగా మాత్రమే సీతక్కతో సమావేశం అయ్యానని చెప్పారు స్మితా సబర్వాల్‌. పోస్టింగ్‌కి సంబంధించి ఎలాంటి సిఫార్సు లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget