Nirmal News: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మహాధర్నా, 5 గంటలుగా కారులోనే ఆర్డీఓ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Telangana News | తెలంగాణలో ఏదో ఓ చోట ఫ్యాక్టరీలు వద్దని ఆందోళన జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్ పూర్ మండల రైతులు రోడ్డెక్కి 11 గంటలుగా బైఠాయించారు.
![Nirmal News: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మహాధర్నా, 5 గంటలుగా కారులోనే ఆర్డీఓ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు Villagers Protest against Ethanol Factory inNirmal District RDO stuck in Car Nirmal News: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మహాధర్నా, 5 గంటలుగా కారులోనే ఆర్డీఓ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/ba96a47255a0bdb85d79b74637158f591732633191527233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nirmal Ethanol Factory Problem | నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ మండల రైతులు తమ భూముల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు.. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం ధర్నాకు దిగారు. ఈ రాస్తారోకోలో మహిళలు, పిల్లలు అందరు కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు.
5 గంటలుగా కారులోనే ఆర్డీఓ
ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ దిలావర్పూర్‌లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుందని ఆర్డీఓ రత్నకళ్యాణి అక్కడికి వెళ్లారు. ఆ నాలుగు గ్రామాల ప్రజలు ఆర్డీఓను కారులోనే నిర్బందించారు. 5 గంటలు గడుస్తున్నా ఆర్డీఓను వారు విడిచిపెట్టలేదు. ఆందోళనకు దిగిన ప్రజలు చలి మంటలు సైతం వేసుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారిపై ఉదయం ప్రారంభమైన ఆందోళన 11 గంటల నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్
పంటపొలాల్లో కాలుష్యం నింపే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో భైంసా నిర్మల్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భైంసా నుంచి వచ్చే బస్సులను నర్సాపూర్ లో నిలిపివేశారు. జాతీయ రహదారిపై దిలావర్ పూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించగా, దిలావర్ పూర్ మండలంలోని 4 గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, తదితర నాయకులు కనబడటం లేదంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. నాయకులకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిరసనలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆందోళనబాట చేపట్టిన రైతులు, సమీప గ్రామ ప్రజలు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గుండంపల్లి, దిలావర్ పూర్ ప్రజలు, రైతులు జేఎసీలు ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాయి. గుండంపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దాదాపు రోజులకు పైగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
Also Read: Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)