News
News
X

Dharmapuri Arvind House Attack: ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి - 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి.

FOLLOW US: 

బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం క్షష్టంగా మారింది. అక్కడకి చేరుకొని బీజేపీకి, ఎంపీ అరవింద్ కు వ్యతిరేక నినాదాలు నినాదు చేస్తూ ఇంటి అద్దాలు పగులగొట్టారు. దీనిపై ధర్మపురి అరవింద్, ఆయన తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు పై టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది అరెస్ట్ చేశారు. ఐపీసీ 452,148,427,323,354, r/w 149 సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన వారిని నేటి రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు.

కాంగ్రెస్ లో చేరతారని ప్రచారంపై వివాదం.. 
కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని అరవింద్‌ నిన్న కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను, కవిత కలిసిందని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఎమ్మెల్సీ కవిత తన మీడియా సమావేశంలో వెంటపడి తంతం కొట్టి కొట్టి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ 50 మంది టీఆర్ఎస్ నాయకులను ఉసిగొల్పి కవిత తన ఇంటిపై దాడికి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు. 

తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అర్వింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని..  టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని..  కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు.

News Reels

Published at : 19 Nov 2022 12:02 AM (IST) Tags: MLC Kavitha Dharmapuri Arvind Kavitha Arvind Dharmapuri TRS Leaders Arrest

సంబంధిత కథనాలు

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

Kamareddy News : సోది క్లాస్ అంటూ ఇన్ స్టాలో స్టూడెంట్స్ పోస్ట్, పచ్చికట్టెలు విరిగేలా కొట్టిన టీచర్!

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో 3 నెలల బాబుకు ప్రధాని మోదీ పేరు పెట్టిన బండి సంజయ్

Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో 3 నెలల బాబుకు ప్రధాని మోదీ పేరు పెట్టిన బండి సంజయ్

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Nizamabad News: ఈ వాగ్ధానాలు అన్నీ ఎన్నికల కోసమే, ఆయన చెప్పేవి కాకి లెక్కలు: కాంగ్రెస్

Nizamabad News: ఈ వాగ్ధానాలు అన్నీ ఎన్నికల కోసమే, ఆయన చెప్పేవి కాకి లెక్కలు: కాంగ్రెస్

టాప్ స్టోరీస్

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Rajahmundry News : రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక సంబరాలు, స్టెప్పులతో హోరెత్తించిన మంత్రి రోజా!

Rajahmundry News : రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక సంబరాలు, స్టెప్పులతో హోరెత్తించిన మంత్రి రోజా!