KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
కేటీఆర్‌కూ నోటీసులు ఇవ్వాల్సిందేనని రేవంత్ డిమాండ్ చేశారు. లేకపోతే్ తాను హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.
KTR Vs Revanth Reddy : మార్చి 23వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ఈ సిట్ నోటీసులకు స్పందిస్తానని వివరణ ఇస్తానని రేవంత్‌రెడ్డిత ప్రకటించారు. సిట్‌కు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని, సిట్ నోటీసులు ఊహించినదే అని ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పారు. సిట్ అధికారి శ్రీనివాస్, కేటీఆర్ బావమరిది ఇద్దరూ ఫ్రెండ్సే అని, ఇద్దరూ ఫ్రెండ్స్ అన్నందుకే తనకు సిట్ నోటీసులు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?, తనతో పాటు కేటీఆర్, సబిత, శ్రీనివాస్‌గౌడ్‌కు సిట్ నోటీసులివ్వాలని, లేకపోతే సిట్ అధికారిపై హైకోర్టు కు వెళ్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరుగుతున్న పరీక్షల ప్రశ్నా పత్రాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నిందితులను స్పెషల్ ఇన్వేస్ట్ గేషన్ టీం వారు ఇన్వెస్ట్ గేషన్ చెయ్యకముందే ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇందులో సంబంధం ఉందని ఎలా చెబుతారన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నేను తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని అన్నారు. ఈ దొంగతనం తామే బైటపెట్టామని గంగుల అంటున్నాడు. నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి, ఆరాచకాలకు కారణం కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ పరీక్షలు 30 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్లో కంప్యూటర్ వాడాలన్నా.... తెలంగాణ స్టేట్ టెక్నాలజీ ప్రతిపాదనకు పంపిస్తే... ఐటీ శాఖ అనుమతి ఇస్తేనే మంజూరు చేయటం జరుగుతుందన్నారు. టీఎస్పీఎస్ అనే సంస్థకు చైర్మన్ జగన్మోహన్ రావు. ఈయన కేసీఆర్ బంధువు. కేటీఆర్ సూచనమేరకే జగన్మోహన్ రావును 2021లో టీఎస్ పీయస్ చైర్మన్ గా కేసీఆర్ నియమించారు. ఐటీ శాఖ మంత్రి కింద తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సంస్థ పనిచేస్తుందన్నారు. అలాంటి ఐటీ శాఖకు తెల్వకుండా... పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తెల్వకుండా ... ప్రశ్న పత్రం ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు రేవంత్.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పని చేసే ప్రవీణ్ కుమార్ తండ్రి హరిచందర్ రావు రాజమండ్రికి చెందిన వ్యక్తి. ప్రవీణ్ కుమార్ ను జూనియర్ సిస్టెంట్ గా ఎలా నియమించారని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. అసలు కేసీఆర్ కు తెలంగాణ రక్తం ఉందా అని అడుగుతున్నా అని అన్నారు రేవంత్ రెడ్డి. లక్షలాది ఉద్యోగాలు నియమించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ముఖ్యమైన వాటిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా అప్పజెపుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మొదట్నుంచీ ప్రశ్నపత్రాల లీక్ లో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరే కారణమని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డిని కేటీఆర్ నియమించారు... కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ను నియమించారన్నారు.
సిట్ వేయడమంటే కేసును కాలగర్భంలో కలిపే ప్లాన్ అని రేవంత్ ఆరోపించారు. సినీ తారల డ్రగ్ విషయంలో కూడా సిట్ విచారణ అధికారిగా అకున్ సబర్వాల్ ను నియమించారు. అర్దాంతరంగా అతను మాయమయ్యాడు. నయీమ్ కుంభకోణం విషయంలో కూడా సిట్ వేశారు. అది ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్ విచారణతో న్యాయం జరగదని కాంగ్రెస్ భావిస్తోందని స్పష్టం చేశారు. అందుకే సీబీఐ విచారణ జరిపించాలి లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.