News
News
X

Asifadabad News: ఆసిఫాబాద్ జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ భవనాలు ప్రారంభించిన మంత్రులు

Asifadabad News: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన 7 పోలీస్ స్టేషన్ భవనాలను మంత్రులు మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డిలు ప్రారంభించారు. 

FOLLOW US: 
 
Asifadabad News: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌ క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన  పోలీస్‌ స్టేషన్ ల‌ను మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కోనేరు కోన‌ప్ప‌, ఆత్రం స‌క్కు, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి,  జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కోవా ల‌క్ష్మి, పోలీస్ హౌజింగ్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ కోలేటి దామోద‌ర్ గుప్తా, క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

నూతన భవనాల ప్రారంభం

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కోటి రూపాయాల వ్య‌యంతో నిర్మించిన‌ కాగ‌జ్ న‌గ‌ర్  రూర‌ల్ పోలీస్ స్టేష‌న్, రూ. 30 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన‌ స‌ర్కిల్ ఇన్స్పెక‌ర్ట్  కార్యాల‌య భ‌వ‌నాల‌ను ప్రారంభించారు. కాగ‌జ్ న‌గ‌ర్ రూర‌ల్ పోలీస్ట్ స్టేష‌న్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వాంకిడి  పోలీస్ స్టేష‌న్ (రూ. 2. 50 కోట్లు), కౌటాల పోలీస్ స్టేష‌న్ (రూ. 2. 50 కోట్లు),  పెంచిక‌ల్ పేట్ పోలీస్ స్టేష‌న్ (రూ. 2. 50 కోట్లు), చింత‌ల‌వానిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ (రూ. 2. 50 కోట్లు) ల  శిల‌ఫ‌కాల‌ను ఆవిష్క‌రించి, వ‌ర్చువ‌ల్ ద్వారా నూత‌న పోలీస్ స్టేష‌న్  భ‌వ‌నాలను ప్రారంభించారు.  అంత‌కు ముందు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప్రాంగ‌ణంలో మంత్రులు మొక్క‌లు నాటారు. 

అనంత‌రం కోటి రూపాయాల వ్య‌యంతో నిర్మించిన‌ రెబ్బ‌న పోలీస్ స్టేష‌న్ నూత‌న భ‌వ‌నాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు రూర‌ల్  పోలీస్ స్టేషన్‌లోని అన్ని గదుల్లో కలియ తిరిగారు.  పోలీస్‌ స్టేషన్‌లో నిర్మించిన ఎస్‌హెచ్‌వొ గదిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మ‌హిళా ఎస్‌ఐని కుర్చీలో కూర్చోబెట్టి వేద పండితులు ఆశీర్వచనం చేసి అభినందించారు. స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కమ్ వెయిటింగ్ హాల్, యాంటె రూమ్‌తో ఎస్‌హెచ్‌వొ రూమ్, రైటర్ రూమ్, ఇంటర్వ్యూ గది, కమ్యూనికేషన్ రూమ్, సీసీ కెమెరాల‌ను మంత్రులు, డీజీపీ పరిశీలించారు.

News Reels

అనంత‌రం మంత్రులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్​ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించార‌ని అన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలకు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు.

Published at : 16 Nov 2022 02:03 PM (IST) Tags: Indrakaran reddy Asifabad News Kagajnagar Ministers police station building minister mahamood ali

సంబంధిత కథనాలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు