(Source: ECI/ABP News/ABP Majha)
Nizamabad: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించటమే కేసీఆర్ సర్కార్ లక్ష్యమన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యసౌకర్యాలు మెరుగుపడ్డాయని.. వీటిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మరిన్న సేవలు చేస్తామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేల్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ప్రారంభించారాయన. మిత్రుల సహకారంతో ప్రభుత్వాసుపత్రిలో 31 లక్షలు ఖర్చు చేసి ఎనిమిది ఐసీయూ, ఆరు ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్‌లో కూడా ఐసీయూ బెడ్ లేకుండేదని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఎవరూ ఊహించని కరోనా లాంటి వింత వైరస్ మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని, కరోనా మనకు ఎన్నో పాఠాలు కూడా నేర్పిందని చెప్పారు మంత్రి. రెండో వేవ్‌లో ఎంతో మంది ఆత్మీయుల్ని కోల్పోయామని.. ఎంత డబ్బు ఉన్న దగ్గర్లో అత్యవసర సౌకర్యాలు లేక వారిని కాపాడుకోలేక పోయామని చాలా బాధపడ్డారు. ప్రజలకు మంచి చేయాలని తనతోపాటు నడిచేవాళ్ళంతా తన ఆత్మీయులు, కుటుంబ సభ్యులే అని అన్నారు.
మిత్రుల సహకారంతో 1.5కోట్ల వ్యయం చేసి బాల్కొండ నియోజకవర్గ హాస్పిటల్స్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని 12 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇప్పుడు ఐసియు, ఆక్సిజన్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్, వాటర్ ఆర్వో ప్లాంటు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి. మిత్రులతోపాటు ఆయన సతీమణి నీరజారెడ్డి కూడా హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోసం 25 లక్షలు ఇచ్చారని చెప్పారు. ఇటీవల ఒక మిత్రుడు 27లక్షల విలువ గల ఆక్సిజన్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందన్నారు. తోడ్పాటునందించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?
Also Read: నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !
Also Read: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి