(Source: Poll of Polls)
Viral News: తండ్రి భుజంపై ఎక్కి రాఖీ కట్టించుకున్న బాలుడు - గుండెల్ని పిండేసే ఘటన
Raksha Bandhan 2024 | అక్కలతో రాఖీ కట్టించుకుందామని ఎంతో సంతోషంగా హాస్టల్ కు వెళ్లిన బాలుడికి నిరాశే ఎదురైంది. మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది.
Ramakrishnapur social welfare school in Mancherial district | మంచిర్యాల: రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. రక్షా బంధన్ అంటే తోడబుట్టిన సోదరుడికి అక్కాచెల్లెమ్మలు రాఖీ కట్టడం మన సంప్రదాయం. కానీ ఎంతో సంతోషంగా అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా రామక్రిష్ణ పూర్ లో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. కనీసం రాఖీ కట్టించుకోవడానికి బాలుడ్ని అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువవెత్తుతున్నాయి.
దాసరి అశ్విక, సహస్ర అనే బాలికలు మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. నేడు రక్షా బంధన్ సందర్భంగా తండ్రి తన కుమారుడ్ని తీసుకుని హాస్టల్ కు వెళ్లాడు. అయితే రాఖీ కట్టించుకునేందుకు బాలుడు జితేంద్రను ఆ స్కూల్ మేనేజ్ మెంట్ లోపలకి అనుమతించలేదు. దాంతో హాస్టల్ వెనుక వైపు వెళ్లి.. తండ్రి తన కుమారుడు జితేంద్రను భుజాలపై ఎత్తుకున్నాడు. దాంతో కిటికీ నుంచే ఆ బాలికలు తమ సోదరుడు జితేంద్రకు రాఖీ కట్టారు. అనంతరం తండ్రి తెచ్చిన స్వీట్లను తమ్ముడికి తినిపించారు. అయితే రాఖీ కట్టించుకోవడానికి బాలుడ్ని ఎందుకు అనుమతించలేదంటూ స్కూల్ మేనేజ్ మెంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాఖీ కట్టించుకోవడానికి గురుకులంలోకి లోపలికి అనుమతించని సిబ్బంది.. తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
మంచిర్యాల - రామక్రిష్ణపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలు దాసరి అశ్విక, సహస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల… pic.twitter.com/UohNR1VoAo