Kamareddy Real Heroes: ప్రజల ప్రాణాలకు వీళ్ల ప్రాణాలు అడ్డేస్తున్నారు - వరదల్ని ఎదిరిస్తున్న కామారెడ్డి రియల్ హీరోలు
Kamareddy: కామారెడ్డిలో రెస్క్యూ సిబ్బంది ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డేస్తున్నారు. వందల మందిని వరదల నుంచి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Kamareddy Real Heroes save people lives: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో, మంజీరా నది ఉప్పొంగి పలు గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన , అగ్నిమాపక సేవల శాఖ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అనేక సహాయక చర్యలు చేపట్టి, వందలాది మందిని రక్షించారు.
students are stuck in TTWURJC (BOYS) HOSTEL నాగిరెడ్డిపేట్, సరంపల్లి, కామారెడ్డి@balaji25_t @Collector_KMR @KTRBRS @revanth_anumula pic.twitter.com/dHd0T8cW3m
— Sripaad R (@sripaad125) August 27, 2025
బుధవారం రోజు కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు ఓవర్‌ఫ్లో కావడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పలు ఇళ్లు నీటమునిగాయి. హౌసింగ్ బోర్డ్ వంతెన కూడా వరద నీటితో మునిగిపోవడంతో, ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు. స్థానికులు రక్షణ కోసం అధికారులను అభ్యర్థిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి, NDRF, SDRF బృందాలను రంగంలోకి దింపి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద ముప్పు నుంచి కాపాడాలంటూ ఆర్తనాదాలు
— Telugu Reporter (@TeluguReporter_) August 27, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జల వలయంలో చిక్కుకున్నాయి.
హౌసింగ్ బోర్డ్ కాలనీ, జి ఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవాహం… pic.twitter.com/qZ1wn4MgcF
#Kamareddy లో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నది. కామారెడ్డి పట్టణ పోలీసులు రెస్క్యూ చేసి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/Ca6KLC6jSq
— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025
నిజామాబాద్‌లోని ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డిపేట మండలం అన్నాసాగర్ గ్రామంలోని కళ్యాణ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ల వద్ద సహాయక చర్యలు చేపడుతున్నాయి.
#Kamareddy
— Arvind Kumar (@arvindkumar_ias) August 27, 2025
All the 9 people stranded (on a tanker) at boggugudise (v) yellareddy mandal got rescued by TGSDRF & @sp_kamareddy team .. timely presence of SDRF in coordination with police & dist Admn 👏🏻
More than 30 cms rains recd in Kamareddy & Medak in last 24 hrs pic.twitter.com/dZUS1xyE0m
కామారెడ్డి ఎస్పీ స్వయంగా క్షేత్ర స్థాయిలో సహా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న వారికి స్ఫూర్తిగా నిలిచారు.
Kamareddy District SP Leads Rescue Operation Amidst Heavy Rains
— Congress for Telangana (@Congress4TS) August 27, 2025
భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
నర్వ–అన్నాసాగర్ గ్రామాల మధ్య రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండగా చిక్కుకుపోయిన 9 మందిని SDRF రిస్క్యూ టీం మరియు ఫైర్ సిబ్బంది… pic.twitter.com/IkNzf9A1vK
కామారెడ్డిలో వరద పరిస్థితి అంచనా వేయలేని విధంగా ఉంది. వరదల్లో వందల కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపస్తున్నాయి .ప్రాణనష్టం జరగకుండా.. గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
Heavy rains triggered huge flooding in Kamareddy district. Cars, two wheelers swept away in flood water. Several roads, residences submerged in water. pic.twitter.com/FRkOckvOIF
— Sowmith Yakkati (@YakkatiSowmith) August 27, 2025





















