Kamareddy Rains Visuvals: కశ్మీర్ కాదు కామారెడ్డి - క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ - గురువారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు
Kamareddy rains : కామారెడ్డి లో జల విలయం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. కామారెడ్డికి వెళ్లే అన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. గురువారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు.

Kamareddy has been devastated by unpredictably heavy rains కామారెడ్డిలో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. రికార్డు స్థాయిలో రాజంపేటలో కేవలం 14 గంటల్లో దాదాపు 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది ఒక విపత్తుకు మించిన భీకర పరిస్థితిని సృష్టించింది. 2023లో జయశంకర్ భూపాలపల్లిలోని చిట్యాలలో జరిగిన 600 మి.మీ. వర్షపాతంతో సమానమైన విపత్తు.
#Kamareddy
— Arvind Kumar (@arvindkumar_ias) August 27, 2025
All the 9 people stranded (on a tanker) at boggugudise (v) yellareddy mandal got rescued by TGSDRF & @sp_kamareddy team .. timely presence of SDRF in coordination with police & dist Admn 👏🏻
More than 30 cms rains recd in Kamareddy & Medak in last 24 hrs pic.twitter.com/dZUS1xyE0m
భారత వాతావరణ శాఖ (IMD) , స్థానిక వాతావరణ నిపుణుల ప్రకారం, కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో ఆగస్టు 27, 2025న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మి.మీ. వర్షం కురిసింది, మొత్తం 14 గంటల్లో 499 మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. ఇది ఒక అసాధారణ వాతావరణ ఘటనగా నిపుణులు అభివర్ణించారు.
Kamareddy Cheruvu Overflowing.
— Naveen Reddy (@navin_ankampali) August 27, 2025
Kamareddy town and surrounding villages have recorded nearly 300 mm of rainfall since yesterday, leading to widespread flooding. Numerous lakes, streams, and rivulets in the region are overflowing.
Both the Manjeera and Manair rivers are in spate.… pic.twitter.com/nbgVvYxKUO
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర ప్రాంతాలు ఈ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంజీరా నది ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. లక్ష్మాపూర్ వద్ద ఒక కల్వర్ట్ కూలిపోవడంతో రవాణా స్తంభించింది. వ్యవసాయ భూములు నీట మునిగాయి, వేలాది ఎకరాల పంటలు నాశనమయ్యాయి.
#kamareddy https://t.co/VogQ8cX36m pic.twitter.com/XgCOwyR1GN
— Sri (@srikarwrites) August 27, 2025
స్థానికులు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కామారెడ్డి-నిజామాబాద్ రైల్వే మార్గంలో రై రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలోని దిగువ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు NDRF బృందాలు రంగంలోకి దిగాయి.
Kamareddy Vinayakanagar road no 5 heavy flow water #kamareddyrains @Collector_KMR @KTRBRS @TeluguScribe @McKamareddy @kamareddy pic.twitter.com/xYYhAQCkOG
— Raam (@Raam12037362) August 27, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను 24x7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు.
#Kamareddy లో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నది. కామారెడ్డి పట్టణ పోలీసులు రెస్క్యూ చేసి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/Ca6KLC6jSq
— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025
IMD ప్రకారం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే కొన్ని గంటలు భీకర వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు దిగువ ప్రాంతాల నుంచి తరలివెళ్లాలని, వరద నీటిలో ప్రయాణించకూడదని అధికారులు సూచించారు. రైతులు తమ పంటల నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లా వ్యవసాయ అధికారులతో సంప్రదించాలని కోరారు. గురువారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు.





















