BJP Office : హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌కు ఉగ్రముప్పు - భద్రత కోసం ఖర్చులు భరించాలన్న పోలీసులు !
హైదరాబాద్‌లో బీజేపీ ఆఫీసుకు ఉగ్రముప్పు ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకు అవసరమైన ఖర్చులు పెట్టుకోవాలని పోలీసులు బీజేపీ రాష్ట్ర నేతలకు సూచించారు.
హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం అయిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్‌కు ( BJP Office ) పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. ఉగ్రవాదుల ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు ( Hyderabad ) చెందిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బీజేపీ ఆాఫీసును పరిశీలించారు. భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టు బడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉంది. అలాగే నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ కారణంగా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. సమాచారం సేకరించారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు.
మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునే పనిలో టీఆర్ఎస్ - మోదీ మాటలతో రాజకీయ కార్యాచరణ !
రెండు వారాల క్రితం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించాయి. అప్పట్లో సంబంధంలేని వ్యక్తులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ తెలంగాణ నేతలకు ( Telangana BJP leaders ) ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారిపై మానిటరింగ్ లేదని హెచ్చరించింది. పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు ఈ మేరకు హెచ్చరించాయి. దీంతో ముందు జాగ్రత్తగా గుర్తింపు కార్డు లేని కార్యకర్తలను కూడా బీజేపీ కార్యాలయంలోకి ప్రదర్శనల కోసం రావొద్దని సూచిస్తున్నారు. అనుమతించడం లేదు. బీజేపీ ముఖ్య నేతలు కూడా రాష్ట్ర కార్యాలయంలో పని ఉన్న వారు మాత్రమే రావాలని సూచిస్తున్నారు.
అప్పట్నుంచి హైదరాబాద్ ఆఫీసుకు భద్రత ఉన్నప్పటికీ తాజాగా హైదరాబాద్ ఎంపీ ఓవైసీపై ( MP Owisi ) యూపీలో కాల్పులు జరగడంతో మరోసారి బీజేపీ ఆఫీస్‌పై దాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎంఐఎం కార్యకర్తలైనా దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా తమ కార్యాలయానికి వస్తున్న హెచ్చరికలపై స్పందించారు.ది. భద్రత కల్పించాల్సి బాధ్యత పోలీసులదే అని బీజేపీ పేర్కొంది. అయితే భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు ఖర్చులు భరిస్తారో లేదో స్పష్టత రాలేదు కానీ పోలీసులు మాత్రం భద్రత ( Police Secuerity ) కల్పిస్తున్నారు.