అన్వేషించండి
Advertisement
Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు
వాన జోరు రైతన్నను బేజారు చేస్తోంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట పాడైపోతోంది. కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంటను కోసి రోడ్లు, కల్లాల్లో ఆరబోసిన సోయా, మొక్కజొన్న ధాన్యాన్ని వానల నుంచి కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. రెండ్రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలోని పలు చోట్ల ధాన్యం తడిసింది. సోయాకు తడి తగిలితే మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నాడు.
రాత్రులు, తెల్లవారుజామున వర్షం పడడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం తడవకుండా కుప్పలు చేసి వాటిపై టార్పాలిన్లు కప్పి ఉంచుతున్నారు. వర్షపు నీరు లోపలికి రాకుండా అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 59 వేల ఎకరాల్లో సోయా, 30,345 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు.
గత నెల మొదటి వారం నుంచే సోయా, మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టడం ప్రారంభించారు. ఎండిన పంటను ఇప్పటికే వ్యవసాయ మార్కెట్లకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. సాగు చేసిన దాంట్లో ఇప్పటి వరకు కేవలం 30 శాతం పంటను మాత్రమే మార్కెట్ కు తరలించారు రైతులు. ఇంకా 70 శాతం పంట రోడ్లు, కల్లాల్లోనే ఉంది. మరో రెండు రోజులైతే పంట పూర్తిగా ఎండేది. చివరి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నెల 10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో అని రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే వానకాలం సీజన్లో కురిసిన వర్షాలకు సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గింది. పంటను అమ్మే సమయంలో కూడా వర్షాలతో నాణ్యతపై ప్రభావం పడే ఆవకాశముంది.
జిల్లాలో వానకాలం సీజన్లో 3.77లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 60 శాతం పంట ప్రస్తుతం కోతల దశకు చేరుకుంది. వర్ని, బోధన్, ఇతర ప్రాంతాల్లోనైతే వరి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కోతకు వచ్చిన పరిపంట నేలకి ఒరుగుతోంది. వర్షాలు ఇంకా ఇలాగే పడితే పంట భారీగా నష్టపోయే అవకాశముంది. దీంతో పంట కోతకు ఇబ్బంది. విత్తనాలు నేలరాలి దిగుబడి తగ్గే ప్రమాదముంది. నేలకొరిగిన వరి పంటను కింది నుంచి కోయాలంటే వరి కోత యంత్రాలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రైతులు అవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వరి ధర బాగా వస్తోంది. క్వింటాకు 1900 పైనే పలుకుతోంది. ఈ దశలో వరి కొస్తున్న రైతులకు ఈ వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion