అన్వేషించండి

Nirmal News: 100 శాతం కేంద్రం నిధులతోనే నిర్మల్ లో రైల్వే లైన్ నిర్మాణం- మాజీ ఎమ్మెల్యే ఏలేటి

Nirmal Ex MLA Alleti Maheshwar Reddy: కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులతో నిర్మల్ లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుందని బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Nirmal Ex MLA Alleti Maheshwar Reddy: 

కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులతో నిర్మల్ లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుందని బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేటి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆర్మూర్, హైదరాబాద్ పఠాన్ చెరువు వరకు రైల్వే లైన్ మంజూరు చేస్తూ నిధులు విడుదల చేశారు. 
700 కిలోమీటర్ల రైల్వే లైన్ ఆగిపోయింది..
స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బా ఛానెల్ లో డబ్బా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కోటాను ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తో ఇప్పటి వరకు తెలంగాణలో 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఆగిపోయిందని ఆరోపించారు. రైల్వే లైన్ రాకుంటే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గు లేకుండా రైల్వే లైన్ వారి కృషితో వచ్చిందని గాప్పాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏద్దేవా చేశారు. 
అలాగే దళిత బంధును ఎన్నికల స్టంట్ లో బాగంగా హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ లో ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ దళిత కుటుంబానికి, ప్రతీ బీసీ కుటుంబానికి, ప్రతీ గిరిజన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో నిర్మల్ నియోజక వర్గంలో దళిత బంధు రాని వెలాదిగా దళిత కుటుంబాలతో వచ్చే మంగళవారం 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు.

ప్రతి దళిత కుట్టుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,  48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన అనంతరం... బీసీ బంధు, గిరిజన బంధు పై కూడా తదుపరి కార్యాచరణ  ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే నెల నరేంద్ర మోదీ నిర్మల్ కు వస్తున్న  సందర్బంగా నిర్మల్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధానికి నిర్మల్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు మహేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, సామ రాజేశ్వర్ రెడ్డి, సాదం అరవింద్, అయ్యన్నగారి రాజేందర్, గాదె విలాస్, ముత్యం రెడ్డి, అలివేలు మంగ, కమల్ నయన్, వొడిసెల అర్జున్, నరేష్, అల్లం భాస్కర్, జమాల్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి గత నెలలో నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా వెనక్కి తగ్గలేదు. పైగా బీజేపీ నేతలను నిర్మల్ కు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చివరగా బీజేపీ పెద్దలు మహేశ్వర్ రెడ్డితో దీక్ష విరమింపజేశారు.
Also Read: Mutton Canteen Hyderabad: ప్రభుత్వం గుడ్‌న్యూస్! హైదరాబాద్‌లో మటన్ క్యాంటీన్‌లు, తొలి క్యాంటీన్ ఇక్కడే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget