అన్వేషించండి

Nagoba Jatara 2025: ఆదివాసీలకు పవిత్రమైన పుష్య మాసం - ఈ నెలంతా వారికి పండుగలు, జాతరలే

Adilabad News | ఆదివాసీలు పుష్య మాసాన్ని తమకు పవిత్ర మాసంగా భావిస్తారు. మాసం పూర్తయ్యేంత వరకు నాగోబా జాతర సహా వరుస వేడుకలు జరుపుకునేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారు.

Pushya Masam 2025 Telugu Calendar | ఆదిలాబాద్: ప్రకృతిని పూజించే ఆచారం, కొండా కోనల్లో జీవనం, అడవే జీవనాధారం. ఇక వారి వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ వారి శైలి భిన్నంగా ఉంటుంది. వారి పండుగల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో పండుగ, ఒక్కో జాతర ఎంతో ప్రత్యేకం.. పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలకు ఎంతో సంబురం. ఆనందంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో వారి పండుగలు, ముఖ్యంగా జాతరలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ జాతరలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతాయి.

ఆదివాసీ గ్రామాలు డోలు డప్పు వాయిద్యాలతో సందడి వాతావరణంతో.. ఆదివాసీలు నియమ నిష్టలతో నెల రోజుల పాటు కాళ్ళకు చెప్పులు ధరించ కుండా పవిత్రంగా ఉంటూ, ప్రత్యేక పూజలు చేస్తూ తమ ఆరాధ్య దైవాలను కొలుస్తుంటారు. ఆదివాసీలకు ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. వారి అలవాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. ప్రతి నెలా ఒక్కో మాసంలో ఒక్కో పూజా కార్యక్రమం, వాటికి అనుగుణంగా ప్రత్యేక నియమ నిబంధనలు. ఆదివాసీలు వారి తెగల రూపంలో జీవిస్తున్న గోండు, కోలాం, పర్ధాన్, తోటి తెగల వారీ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. 


Nagoba Jatara 2025: ఆదివాసీలకు పవిత్రమైన పుష్య మాసం - ఈ నెలంతా వారికి పండుగలు, జాతరలే

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పుష్యమాసంలో నిర్వహించే ఆదివాసీల సాంప్రదాయ పూజలు,పండుగల సంబరాలు ప్రారంభమయ్యాయి. పుష్యమాసం ప్రారంభం కావడంతో ఆదివాసీలు ఎంతో ఉత్సాహంగా తమ పండుగలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కాళ్ళకు చెప్పులు ధరించ కుండా పవిత్రంగా ఉంటూ, ఆచారాలలో భాగంగా గోండి ధర్మ సిద్ధాంతాలను పాటిస్తూ, ప్రకృతిని పూజిస్తూ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. 

కారడవిలో భక్తి శ్రద్ధలతో జంగుబాయి ఉత్సవాలు

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో దట్టమైన పచ్చని అడవిలో కొలువై ఉంటుందీ జంగుబాయి పుణ్యక్షేత్రం పుష్యమాసంలో ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో జంగుబాయిని కొలుస్తారు. దేవత అనగానే మనమంతా ఓ ఆకారం అని ఊహిస్తాం, కానీ ఇక్కడ ఓ గుహలో దీపం వెలుగుతుంటుంది. ఆ దీపాన్నే రూపంగా ఊహించుకొని పూజలు చేస్తారు. గుహ లోపలికి వెళ్లాలంటే కొంచం కష్టపడి చెళ్లాల్సిందే. మన దగ్గర నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివచ్చి తమ ఆదిదైవమైన జంగూబాయిని దర్శించుకుంటారు.


Nagoba Jatara 2025: ఆదివాసీలకు పవిత్రమైన పుష్య మాసం - ఈ నెలంతా వారికి పండుగలు, జాతరలే

తైలం తాగే మహోత్సవం.. ఖాందేవ్ జాతర

ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించే ఖాందేవ్ జాతర ఆద్యంతం అద్భుతమే. మాన్కాపూర్ లోని గోవర్ధన్ గుట్ట వద్ద ఆ వంశస్తులు కుటుంబసమేతంగా తొడసం వంశస్థులు చేస్తారు. మసిమల్ దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు. అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు, పులి దేవతకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు.

తోడసం వంశం అడబిడ్డ పవిత్రమైన నువ్వుల నూనె త్రాగుతుంది. తొడసం వంశీయుల సమక్షంలో ఓ పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఆమె సేవిస్తుంది. ఖాందేవ్ మహా పూజ కోసం తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి నువ్వుల నూనెను తీసుకొస్తారు. ఆ నూనెను ఓ పాత్రలో సేకరించి తొడసం అడపడుచు సేవించడం ఇక్కడి ఆదివాసీలు అనాదిగా పాటిస్తున్న ఆచారం. తమ కుటుంబాలను, పాడి పంటలను ఖాందేవ్ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నూనె మొక్కును చెల్లిస్తారు. ఇదీ తొడసం వంశీయుల ఆచారం. 


Nagoba Jatara 2025: ఆదివాసీలకు పవిత్రమైన పుష్య మాసం - ఈ నెలంతా వారికి పండుగలు, జాతరలే

కేస్లాపూర్ నాగోబా జాతర

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ జాతరల్లో ఒకటిగా విలసిల్లుతోంది. సర్ప జాతిని పూజించడమే ఆ పండగ ప్రత్యేకత. పుష్యమాసం అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో ఆదివాసి పూజారులకు ఆరాధ్య దైవం ఆదిశేషు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని ఆదివాసులు విశ్వసిస్తారు. ఆదివాసిల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మేస్రం వంశీయులు గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబాను అభిషేకించి.. మహపూజ చేస్తారు. వారం రోజుల పాటు అంగరంగ వైభంగా నాగోబా జాతర జరుగుతుంది. 

బుడుందేవ్, మహాదేవ్, సదల్ పూర్ జాతర

నాగోబా జాతర ముగిసిన తర్వాత ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామంలో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రారంభిస్తారు. శ్యాంపూర్ గ్రామంలోని బుడుందేవ్ జాతర ముగిసిన తర్వాత సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతరను ప్రారంభిస్తారు. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్ ను కొలుస్తారు. ఆ తరువాత అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ లో బైరందేవ్, మహాదేవ్ ఆలయాల్లో సదల్ పూర్ జాతరను నిర్వహిస్తారు. మనసులో ఏదైనా కోరుకొని బైరందేవ్ ఆలయంలో ఉన్న శివ లింగాన్ని పైకి ఎత్తాలి.. కోరిక నెరవేరేదైతే శివలింగం సుష్ఠుగా పైకి లేస్తుందని భక్తుల నమ్మకం. లేదంటే ఏటూ కదలకుండా ఉంటుంది.

Also Read: Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రతి ఏటా పుష్యమాసంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో నిర్వహిస్తుండటంతో జాతరను జంగి జాతరగా పిలుస్తుంటారు. ఈ ఆలయాల్లో కేవలం కోరంగీ వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జాతర కొనసాగిన తర్వాత అమవాస్య రోజున కాలదహి హండి' కార్యక్రమం నిర్వహించి జాతరను ముగిస్తారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సాంప్రదాయ పూజలు, జాతరలుంటాయి. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో తమ ఆది దైవాలను కొలుస్తూ, భిన్నమైన శైలిలో ప్రకృతి ఒడిలో ఉంటూ సాంప్రదాయ ఆరాచారాలు పాటిస్తూ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు ఆదివాసీలు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Embed widget