News
News
X

తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌వైపే ప్రజలంతా- ఎమ్మెల్సీ కవిత విశ్వాసం

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు.

FOLLOW US: 
 
ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే  ఉన్నారని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అవాకులు చవాకులు  పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని... తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉంటారని జోస్యం చెప్పారు. 

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు.. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నట్లు ఆలయ కమిటీ వారు అడిగారని ఇందుకోసం 50 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు.. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. 

గల్ఫ్‌ బాధితులకు అండగా కవిత 

బదుకు దెరువు కోసం ఖతార్ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. దేశం కాని దేశంలో నరకయాతన అనుభవించి జైల్లో చిక్కుకున్న బాధితులను క్షేమంగా స్వదేశానికి రప్పించారు. నిజామాబాద్ నగరం డ్రైవర్స్ కాలానీకి చెందిన ఆసియా బేగం, షేక్ నసీమాలు గత పది నెలల క్రితం బతుకు దెరువు కోసం ఖతర్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వేధింపులకు గురి చేశారు. ఇద్దరు మహిళతో పని చేయించుకుంటూ, అటు జీతం డబ్బులు ఇవ్వక, తిండి కూడా సరిగ్గా పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించారని బాధితులు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై వేడి నీళ్లు పోసి నరకాయాతనకు గురిచేశారని తెలిపారు. బాధితులు అక్కడి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. 

News Reels

అయితే వేధింపులు తట్టుకోలేని వాళ్లు తప్పించుకొని బయటకు రావడంతో.. పోలీసులు రన్ అవే కేసు కింద వారిని జైల్లో పెట్టారు. బాధితులు ఈ విషయాన్ని నిజామాబాద్ నగరంలో ఉన్న వారి బంధువుల ద్వారా జాగృతి నాయకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి కేవలం 10 రోజుల్లో బాధితులను క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇక్కడికి వచ్చేందుకు ఖర్చు మొత్తం కవితే భరించారని బాధితులు తెలిపారు. తమను క్షేమంగా ఇంటికి చేర్పించిన ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు వివరించారు. బాధితులను ఈరోజు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అవంతి సుధాకర్ తదితరు వెళ్లి మాట్లాడారు.

గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో.. నరకం చూస్తున్న వలసజీవులు!

గల్ప్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాల్లో అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారు. భోజనంతో పాటు ఉచిత వసతి సదుపాయం ఉంటుందని నమ్మిస్తున్నారు. కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వారు చెప్పిన వెంటనే పాస్ పోర్టు ఇతర గుర్తింపు కార్డులు అప్పగిస్తున్నారు. తీరా వీసా వచ్చేసిందని నమ్మించి రూ. 90 వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. మోసపోయిన యువత పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published at : 07 Nov 2022 04:07 PM (IST) Tags: BJP Kavitha TRS BRS Munugodu KCR

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు