మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్ - వీడియో వైరల్
పార్లమెంట్‌లో ఫ్లయింగ్ కిస్ దుమారంపై చర్చ నడుస్తుండగానే మరో ఫ్లయింగ్ కిస్ వైరల్‌గా మారుతోంది.
ఫ్లయింగ్ కిస్ వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమవైపే చూస్తూ ప్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ ఫిర్యాదులు చేయడం పెద్ద దుమారాన్నే రేపింది.
ఈ వ్యవహారంలో ఇంకా చర్చ నడుస్తుండగానే మంత్రి కేటీఆర్ సీన్‌లోకి వచ్చారు. నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలా పర్యటించిన ఆయన స్కూల్ పక్క నుంచి వెళ్లారు.
స్కూల్ పక్క నుంచి మంత్రి కేటీఆర్ వెళ్లడాన్ని చూసిన స్కూల్ విద్యార్థులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. వారి అరుపులు విన్న కేటీఆర్ వాళ్లను విష్ చేశారు. ఏ క్లాస్ అని అడిగారు. దానికి వాళ్లు ఆరో తరగతి అని చెప్పారు. అయితే చదువు కోకుండా ఇలా ఎందుకు ఖాళీగా ఉన్నారని ప్రశ్నించారు కేటీఆర్. స్కూల్‌లో టీచర్స్ లేరా అని ఆరా తీశారు.
తాము మీకు ఫ్యాన్స్ అని... అందుకే ఇలా విష్ కేటీఆర్‌కు వివరించారు ఆ పిల్లలు. అయితే మీకు నేను కూడా ఫ్యాన్ అంటూ రిప్లై ఇచ్చిన కేటీఆర్ వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.
పార్లమెంట్‌లో పెను సంచలనంగా మారిన ఫ్లయింగ్ కిస్ వ్యవహారం నడుస్తున్న టైంలోనే కేటీఆర్ అలాంటి సైగలు చేశారు.