News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mancherial News: మంచిర్యాలలో తీవ్ర విషాదం - భార్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తూ భర్త మృతి

Mancherial News: మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

FOLLOW US: 
Share:

Mancherial News: పక్కింటి వాళ్లతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. పుట్టెడు దుఃఖంతో భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా.. భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈక్రమంలోనే తీవ్ర గాయాలపాలైన అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భార్య అంత్యక్రియలు కాకముందే భర్త కూడా చనిపోవడంతో... కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన 31 ఏళ్ల మల్లికార్జున రావు, 29 ఏళ్ల శరణ్య దంపతులు. అయితే వీరికి పక్కింటి వారితో గొడవ జరిగింది. ఈక్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ శరణ్య శనివారం రోజు మృతి చెందింది. అయితే ఈరోజు మతదేహాన్ని అంబెలెన్సులో స్వగ్రామానికి తరలిస్తుండగా.. లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద మల్లికార్జున రావు వస్తున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడంతో... పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 16 Jul 2023 02:48 PM (IST) Tags: Telangana News Mancherial News Man Died While Moving Wife Dead Body Latest Sad news Mancherial Road Accident

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు

Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

టాప్ స్టోరీస్

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు