News
News
X

KTR Nizamabad Tour: రేపు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్ - పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, బహిరంగ సభ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ లో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

FOLLOW US: 
Share:

- కళా భారతి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ 
- పలు కార్యక్రమాలతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నిజామాబాద్ లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్‌ ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైల్వే కమాన్‌ వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. కేటీఆర్‌ రాక సందర్భంగా నగర పరిధిలో గులాబీ శ్రేణులు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేటీఆర్ బిజీ బిజీ 
నిజామాబాద్ లో కొత్త కలెక్టరేట్‌ ప్రారంభించే సమయంలో పాత కలెక్టరేట్‌ ఆవరణలో కళాభారతిని నిర్మిస్తామని సీఎం కేఆర్‌ హామీ ఇచ్చారు. ఆ పనులకు అనుమతులు మంజూరు చేయడంతో మంత్రి కేటీఆర్ శనివారం ఈ శంకుస్థాపన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌కు చేరుకోనున్నారు. కాకతీయ శాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించడంతో పాటు కళాభారతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

మంత్రి కేటీఆర్‌ రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మించతలపెట్టిన కళాభారతి భవన నిర్మాణ ప్లాన్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు  రూ. 50 కోట్లతో నిర్మించే కళాభారతి ఆడిటోరింయకు సంబంధించిన ప్లాన్‌లను పరిశీలించారు. అధునాతన సౌకర్యాలతో ఈ ఆడిటోరియంను నిర్మించనున్నారు. ఇందూరు జిల్లా చారిత్రక వైభవం చాటేవిధంగా రూ.50 కోట్లతో ఈ నిర్మాణం ఉండనుంది. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాభారతి నిర్మాణం చేయనున్నారు. కేటీఆర్ టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చూసుకుంటున్నారు. కేటీఆర్ వచ్చే మార్గంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు నగర బీఆరెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేశారు.

నిజామాబాద్ అర్బన్‌లో మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం. ఆకుల లలిత కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం కావటం... వచ్చే ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. ఆకుల లలిత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.  గతంలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నుంచి ఆకుల లలిత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి లేదన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె గురి నిజామాబాద్ అర్బన్ పై మళ్లీందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇప్పటికే రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. మూడోసారి రంగంలోకి దిగేందుకు బిగాల సమాయత్తమవుతున్నారు. అయితే ఆకుల లలిత కూడా అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Published at : 27 Jan 2023 05:08 PM (IST) Tags: KTR BRS Telangana Nizamabad KTR Nizamabad Tour

సంబంధిత కథనాలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

Congress: కొత్త ఇండ్లు దేవుడెరుగు, ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మాయం చేశారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Congress: కొత్త ఇండ్లు దేవుడెరుగు, ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మాయం చేశారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!